Arya Action Thriller Captain Movie Telugu Trailer Out - Sakshi
Sakshi News home page

Captain Movie Trailer: ఏలియన్‌తో హీరో ఆర్య పోరాటం.. ఆసక్తిగా ‘కెప్టెన్‌’ ట్రైలర్‌

Aug 22 2022 4:30 PM | Updated on Aug 22 2022 5:59 PM

Arya Action Thriller Captain Movie Telugu Trailer Out - Sakshi

తమిళ హీరో ఆర్య హీరోగా తాజాగా తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం కెప్టెన్‌. శక్తి సౌందన్‌ రాజన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్‌ 8న ప్రేక్షకులు ముందుకు రాబోతోంది, ప్రస్తుతం పోస్ట్‌ ప్రోడక్షన్‌ పనులతో పాటు ప్రమోషన్స్‌ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇక మూవీ ప్రమోషన్స్‌ జోరు పెంచిన మూవీ టీం తాజాగా మూవీ ట్రైలర్‌ను సోషల్‌ మీడియా వేదికగా రిలీజ్‌ చేశారు. ఇండియన్‌ ఆర్మీ, ఏలియన్‌లతో చేసే పోరాటం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ను ఆసక్తిగా మలిచారు.

చదవండి: నెపోటిజంపై నోరు విప్పిన నాగ చైతన్య.. ఏమన్నాడంటే

ఆర్మీ అధికారులు ఓ గ్రహాంతరవాసితో తలపడే యాక్షన్‌ సీన్స్‌ ఉత్కంఠ రేపుతున్నాయి. ఇక ట్రైలర్‌లోని యాక్షన్‌ సీన్స్‌, ఆర్మీ ఆఫీసర్ల అధికారిగా నటి సిమ్రాన్‌ ఇచ్చే సూచనలు, గ్రహాంతవాసులను ఎదుర్కొనేందుకు ఆర్య వేసే ఎత్తుగడలను వివరిస్తూ సాగిన ఈ ట్రైలర్‌ సినిమాపై మరింత హైప్‌ క్రియేట్‌ చేస్తోంది. కాగా తెలుగులో శ్రేష్ట్‌ మూవీస్‌ సమర్ఫిస్తున్న ఈ చిత్రానికి ఇమ్మాన్‌ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో ఆర్యకు జోడిగా ఐశ్వర్య లక్ష్మి నటించింది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement