ఓటీటీకి వచ్చేస్తోన్న రొమాంటిక్ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Rasavathi The Alchemist OTT Release Date Confirmed | Sakshi
Sakshi News home page

ఏకంగా మూడు ఓటీటీల్లోకి వచ్చేస్తోన్న మిస్టరీ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Published Wed, Jun 19 2024 6:12 PM | Last Updated on Wed, Jun 19 2024 6:38 PM

Arjun Das Romantic Thriller Movie Ott Streaming Date Out Now

అర్జున్ దాస్, తాన్య రవిచంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ చిత్రం 'రసవతి'.  ఈ చిత్రం మే 10న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు శాంతకుమార్ దర్శకత్వం వహించారు. అయితే బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది.

మిస్టరీ థ్రిల్లర్‌గా వచ్చిన రసవతి ఏకంగా మూడు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈనెల 21 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌తో పాటు ఆహా (తమిళం), సింప్లీ సౌత్‌లోనూ స్ట్రీమింగ్‌ కానున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఓవర్‌ సీస్‌ ఫ్యాన్స్ కోసమే సింప్లీసౌత్‌లోనూ స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ మేరకు రసవతి పోస్టర్‌ను మేకర్స్‌ పంచుకున్నారు. ఈ  చిత్రంలో సదాశివగా అర్జున్ దాస్, సూర్యగా తాన్య రవిచంద్రన్ తమ పాత్రల్లో మెప్పించారు.

ఈ చిత్రం కొడైకెనాల్ నేపథ్యంలో సాగుతుంది. ఓ గ్రామంలో వైద్యం చేసే సదాశివ అనే యువకుడి జీవితం ఆధారంగా తెరకెక్కించారు. కాగా.. ఇందులో నిఖిలా శంకర్, దీప, అరుల్ జోతి, రిషికాంత్, సుజాత శివకుమార్, రమ్య సుబ్రమణియన్, జిఎమ్ సుందర్, రేష్మా వెంకటేష్, సుజిత్ శంకర్ కీలక పాత్రలు పోషించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement