హీరో నాగార్జునను కలిసిన అరియానా

Ariyana Glory shares a fangirl moment with Nagarjuna Akkineni - Sakshi

బిగ్‌బాస్ షోలో ముక్కుసూటిదనంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుం​ది అరియానా గ్లోరీ. బిగ్‌బాస్‌ తర్వాత కూడా అదే క్రేజ్‌ను కంటిన్యూ చేస్తుంది ఈ భామ. ఇప్పటికే రాజ్‌ తరుణ్‌తో ఓ సినిమాలో నటిస్తుండగా, మెగా హీరో కల్యాణ్ దేవ్ సినిమాలోనూ ఆఫర్‌ దక్కించుకుంది. పలు టీవీ షోలు, ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్న అరియానా..తాజాగా హీరో నాగార్జునను కలిసింది. ఆయన నటించిన  ‘వైల్డ్‌ డాగ్‌’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ప్రమోషన్లలో ఉన్న నాగార్జునను అరియానా ఇంట‌ర్వ్యూ చేసింది. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా వెల్లడించింది. నా ఫేవరెట్‌ నాగ్‌ సర్‌ని మరోసారి కలిశా..బెస్ట్‌ డే అంటూ నాగార్జునతో కలిసి దిగిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. 

ఇక వైల్డ్‌ డాగ్‌ సినిమాలో నాగార్జున సరసన దియా మీర్జా నటించింది. ఈ చిత్రంలో నాగార్జున సరికొత్తగా కనబడనున్నాడు. ఎన్‌ఐఏ ఆఫీసర్‌గా నాగార్జున డేర్ డెవిల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంతో అహిషోర్‌ సాల్మోన్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సయామీ ఖేర్, అతుల్‌ కులకర్ణి, అలీ రెజా, రుద్ర ప్రదీప్‌ ఇతర పాత్రల్లో నటించారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్‌ 2న విడుదలకానుంది.

చదవండి :  (నాగ్‌పై ముద్దులు కురిపించిన అమల)
(గాలి మోటార్‌ ఎక్కి, చక్కర్లు కొట్టిన గంగవ్వ)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top