ఆశ్రమంలో విరుష్క జంట.. దాతృత్వం చాటుకున్న దంపతులు | Anushka Sharma and Virat Kohli visit Vrindavan ashram distribute blankets | Sakshi
Sakshi News home page

Anushka Sharma and Virat Kohli: ఆశ్రమంలో దుప్పట్లు పంపిణీ చేసిన విరుష్క జంట

Published Wed, Jan 4 2023 9:21 PM | Last Updated on Wed, Jan 4 2023 9:24 PM

Anushka Sharma and Virat Kohli visit Vrindavan ashram distribute blankets - Sakshi

అనుష్క శర్మ, విరాట్ కోహ్లి జంట గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్‌లో అనుష్క, క్రికెట్‌లో విరాట్ తమదైన ముద్ర వేశారు. ఇటీవల న్యూ ఇయర్ సందర్భంగా దుబాయ్‌లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులకు విషెష్ తెలిపారు. తాజాగా ఈ జంట తమ ఉదారతను చాటుకుంది. బాబా నీమ్ కరోలి బృందావన్ ఆశ్రమాన్ని సందర్శించిన విరుష్క జంట అక్కడున్న వారికి దుప్పట్లు పంచారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

విరుష్క జంట దాదాపు గంటపాటు ఆశ్రమంలోనే ఉండి సమాధి వద్ద ధ్యానం చేశారు. అక్కడున్న వారితో చాలాసేపు ముచ్చటించారు. బాబా నీమ్ కరోలి బృందావన్ ఆశ్రమాన్ని సందర్శించిన ఫోటోలను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే గతేడాది నవంబర్‌లో దంపతులు తమ కుమార్తె వామికతో కలిసి ఆశ్రమాన్ని సందర్శించినట్లు సమాచారం.

జులన్ గోస్వామి బయోపిక్‌లో అనుష్క శర్మ

ప్రపంచ క్రికెట్ చరిత్రలో ప్రసిద్ధి చెందిన జులన్ గోస్వామి జీవితం  తెరకెక్కుతున్న చిత్రం 'చక్దా ఎక్స్‌ప్రెస్'. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ కూడా పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి ప్రోసిత్ రాయ్ దర్శకత్వం వహించారు. ఐదు ఏళ్ల గ్యాప్ తర్వాత అనుష్క ఈ సినిమాలో నటిస్తోంది.ఆమె చివరిసారిగా చిత్రం 'జీరో' (2018) కనిపించింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement