ఈ ఇయర్ సెకండాఫ్ నాకు బాగుంది

– అనుపమా పరమేశ్వరన్
‘బటర్ ఫ్లై’ సినిమాలో చేసిన గీత క్యారెక్టర్ నాకు సవాల్ అనిపించింది. ఈ పాత్ర చాలా ఎమోషనల్‌గా ఉంటుంది’’ అని అనుపమా పరమేశ్వరన్ అన్నారు. ఘంటా సతీష్ బాబు దర్శకత్వంలో అనుపమా పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘బటర్ ఫ్లై’. భూమికా చావ్లా, రావు రమేష్, నిహాల్ కోధాటి కీలక పాత్రల్లో రవిప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువల్లూరి, ప్రదీప్ నల్లిమెల్లి నిర్మించారు.
ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ నెల 29న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ద్వారా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా అనుపమా పరమేశ్వరన్ మాట్లాడుతూ – ‘‘ఈ ఇయర్ సెకండాఫ్ నాకు చాలా బాగుంది. నేను హీరోయిన్‌గా నటించిన ‘కార్తికేయ 2, 18 పేజెస్’ హిట్టయ్యాయి. ఇప్పుడు ‘బటర్ ఫ్లై’ రిలీజ్ అవుతోంది’’ అన్నారు. ఘంటా సతీష్ బాబు, ప్రసాద్ తిరువళ్లూరి, నిహాల్, సంగీత దర్శకుడు అర్విజ్ తదితరులు మాట్లాడారు.