తమ్ముడి ఫోటో షేర్ చేసిన స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?

Anupama Parameswaran Shares Her Childhood Pics Goes Viral - Sakshi

'ప్రేమమ్‌' అనే మలయాళ చిత్రంతో దక్షిణాది ఇండస్ట్రీలో సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది ముద్దుగుమ్మ. కోలీవుడ్‌లో ధనుష్‌కు జంటగా కొడి చిత్రంతో ఎంట్రీ ఇచ్చి.. ఆ తరువాత అధర్వ సరసన తల్లిపోగాదే చిత్రంలో కనిపించింది. తక్కువ కాలంలోనే మలయాళం, తెలుగు, తమిళం మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

తెలుగులో శతమానం భవతి చిత్రంలో పాత్రకు మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌తో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది.  ఇంతకీ ఆమె ఎవరో గుర్తుకొచ్చిందా? మరెవరో కాదు.. 18 పేజెస్ సినిమాలో అలరించిన అనుపమ పరమేశ్వరన్. 

తాజాగా అనుపమ తన చిన్ననాటి మధుర జ్ఞాపకాలను సోషల్ మీడియాలో పంచుకుంది. తన  తమ్ముడితో కలిసి దిగిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. అవి కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. తన తమ్ముడితో దిగిన చిన్నప్పటి ఫోటోలు షేర్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటున్న ముద్దుగుమ్మ చిన్నప్పటి ఫోటోలు చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. సిద్ధూ జొన్నలగడ్డ నటించిన ‘డీజే టిల్లు’ సీక్వెల్‌ ‘డీజే టిల్లు స్క్వేర్’లో కనిపించనుంది. కాగా.. గతేడాది నిఖిల్‌తో నటించిన 18 పేజెస్, కార్తికేయ-2 సూపర్ హిట్‌గా నిలిచాయి. అంతేకాకుండా లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లోనూ నటిస్తోంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top