హీరో రామ్‌తో అనుపమ పెళ్లి? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్‌ తల్లి! | Anupama Parameswaran Mother Reacts On Her Daughter Wedding Rumours With Ram Pothineni | Sakshi
Sakshi News home page

Anupama Parameswaran: హీరో రామ్‌ను పెళ్లాడనున్న హీరోయిన్‌.. అనుపమ తల్లి రియాక్షన్‌ ఇదే!

Oct 5 2023 4:49 PM | Updated on Oct 5 2023 5:21 PM

Anupama Parameswaran Mother Reacts On Her Daughter Wedding Rumours With Ram Pothineni - Sakshi

అనుపమ, రామ్‌.. ఇద్దరూ రెండు సినిమాల్లో జంటగా నటించారు. ఉన్నది ఒకటే జిందగీ, హలో గురూ ప్రేమ కోసమే చిత్రాల్లో వీరు కలిసి యాక్ట్‌ చేశారు. ప్రస్తుతం రామ్‌ పోతినేని న

సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై జనాలకు భలే ఇంట్రస్ట్‌.. వారు ఏయే సినిమాలు చేస్తున్నారనే కాదు, ఎవరితో క్లోజ్‌గా కనిపిస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటి? ఇలా అన్నింటినీ ఆరా తీస్తుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే వారి జీవితంలోకి తొంగి చూడాలనుకుంటారు. ఈ క్రమంలోనే కొందరు గాసిప్‌రాయుళ్లు సెలబ్రిటీల గురించి లెక్కలేనన్ని పుకార్లు సృష్టిస్తుంటారు. అందులో లేటెస్ట్‌ రూమర్‌ ఒకటి సోషల్‌ మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది.

హీరోతో ప్రేమలో బ్యూటీ?
బ్యూటిఫుల్‌ హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌, ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ పోతినేని ప్రేమలో ఉన్నారట! త్వరలోనే వీరు ఏడడుగులు వేయనున్నారట! ఈ మేరకు ఓ వార్త నెట్టింట కోడై కూస్తోంది. సాధారణంగా ఇలాంటి గాసిప్స్‌ను అనుపమ లైట్‌ తీసుకుంటుంది. అయితే ఈ రూమర్లు విని విసుగు పుట్టిన అనుపమ తల్లి సునీత సదరు పుకార్లపై స్పందించినట్లు తెలుస్తోంది. హీరోతో పెళ్లి అంటూ వస్తున్న వార్తల్లో పిసరంత నిజం కూడా లేదని కొట్టిపారేసిందట! ఇది చూసిన ఫ్యాన్స్‌.. హమ్మయ్య, మా అనుపమ ఇంకా సింగిలే అంటూ ఎగిరి గంతేస్తున్నారు.

సినిమాల సంగతి..
కాగా అనుపమ, రామ్‌.. రెండు సినిమాల్లో జంటగా నటించారు. ఉన్నది ఒకటే జిందగీ, హలో గురూ ప్రేమ కోసమే చిత్రాల్లో వీరు కలిసి యాక్ట్‌ చేశారు. ప్రస్తుతం రామ్‌ పోతినేని నటించిన స్కంద సినిమా మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంది. అనుపమ విషయానికి వస్తే.. తెలుగులో రవితేజ ‘ఈగిల్‌’, సిద్ధు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు స్వైర్‌’ చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది. ‘సినిమా బండి’ ఫేమ్‌ ప్రవీణ్‌ డైరెక్షన్‌లోనూ ఓ మూవీ చేస్తోంది. తమిళంలోనూ రెండు చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. 

చదవండి: రతిక బర్రె పిల్ల.. రాత్రంతా నిద్రపట్టలేదన్న ప్రశాంత్‌.. బ్యూటీ రియాక్షన్‌ చూశారా?

Advertisement
 
Advertisement
Advertisement