Anubhavinchu Raja: అనుభవించు రాజా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

Anubhavinchu Raja OTT Release Date Confirms, Deets Inside - Sakshi

Anubhavinchu Raja On OTT: రాజ్‌ తరుణ్‌, కశీష్‌ ఖాన్‌ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం అనుభవించు రాజా. శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై సుప్రియ యార్లగడ్డ నిర్మించింది. నవంబర్‌ 26న రిలీజైన ఈ మాస్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ ఆహాలో రిలీజ్‌ అ‍య్యేందుకు రెడీ అయింది. థియేటర్లో రిలీజై నెల రోజులైనా కాకముందే ఆహాలో ప్రసారం కానుంది. డిసెంబర్‌ 17 నుంచి అనుభవించు రాజా చిత్రం అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించింది.

ఇక ఈ సినిమాలో ఊర్లో ఆవారాగా తిరిగే బంగార్రాజుగా, సిటీలో సిన్సియర్‌గా విధులు నిర్వర్తించే సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేసేవాడిగా రెండు వేరియేషన్స్‌ చూపించాడు రాజ్‌తరుణ్‌. తనదైన కామెడీతోనూ నవ్వించాడు. ఈ సినిమా ఇప్పటివరకు చూడనివాళ్లు మరో వారం రోజుల్లో ఆహాలో ఎంచక్కా వీక్షించొచ్చు. ఇదివరకే చూసినవాళ్లు మరోసారి అనుభవించు రాజా చూసి సరదాగా నవ్వుకోవచ్చు!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top