ఆకట్టుకుంటున్న ‘ఆనందమో ఆవేశమో..’ మెలోడీ సాంగ్‌ | Sakshi
Sakshi News home page

Sindhooram: ఆకట్టుకుంటున్న ‘ఆనందమో ఆవేశమో..’ మెలోడీ సాంగ్‌

Published Sun, Nov 20 2022 12:10 PM

Anil Ravipudi To Release First Song From Sindhooram Movie - Sakshi

శివ బాలాజీ , ధర్మ , బ్రిగిడ సాగ(పవి టీచర్) ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం సిందూరం.  ఈ సినిమా లోని మొదటి పాటను తాజాగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేశారు.  ‘ఆనందమో ఆవేశమో..’ అంటూ సాగే ఈ మెలోడీకి  బాలాజీ లిరిక్స్  అందించగా, సింగర్ అభయ్ జోధ్ పుర్కర్ అద్భుతంగా ఆలపించారు. హరి గౌర సంగీతం సమకూర్చాడు.

హీరోహీరోయిన్ల మధ్య లవ్ సాంగ్ గా చిత్రీకరించిన ఈ పాట వినడానికి ఎంతో మనోహరంగా ఉంది.  ప్రముఖ హీరో విజయ్ సేతుపతి సైతం ఈ సాంగ్ గురించి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చెయ్యడం విశేషం.  శ్యామ్ తుమ్మలపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని  శ్రీ లక్ష్మి నరసింహ మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రవీణ్ రెడ్డి జంగా నిర్మిస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement