ఒంటిపై తేనెటీగలతో హీరోయిన్‌ ఫోటో షూట్‌.. వీడియో వైరల్‌

Angelina Jolie Poses With Live Bees for 18 Minutes result - Sakshi

Angelina Jolie: హీరోయిన్లు ఫోటో షూట్‌లో పాల్గొనడం సర్వసాధారణం. అందుకోసం గ్లామర్‌ షో చేయడం కూడా కొత్తేమి కాదు. పోటీ ప్రపంచంలో తోటి హీరోయిన్లను తట్టుకొని సీనీ ఇంటస్ట్రీలో ముందుకు సాగాలంటే అప్పుడప్పుడు వెరైటీ ఫోటో షూట్లు చేయడం​ తప్పనిసరి. అందుకే నేటితరం నటీమణులు ఫోటో షూట్లపై ప్రత్యేక శ్రద్ద పెట్టారు. ట్రెండ్‌కి తగ్గటు డ్రెస్సింగ్‌ స్టైల్‌ని మారుస్తూ హాట్‌ హాట్‌ ఫోటోలతో కుర్రకారు మతులు పోగొడుతూ.. సినీ అవకాశాలు చేజిక్కుంచుకుంటున్నారు. అయితే తాజాగా ఓ హీరోయిన్‌ చేసిన ఫోటో షూట్‌ చూసి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ఫోటో షూట్‌ ఇలా కూడా చేస్తారా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. హాలీవుడ్‌ నటి నటి ఏంజెలీనా జోలి ఒంటి నిండా తేనెటీగలతో ఫోటో షూట్‌లో పాల్గొంది. దాదాపు 18 నిమిషాల పాటు తేనెటీగలను తన శరీరంపై ఉంచుకుంది. ఆ ఫోటోలు, వీడియోలు చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆమె చేసిన ఈ సాహసం గురించి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఇంతకీ ఇదెలా సాధ్యమైంది? అవి కుడితే ఆమె పరిస్థితి ఎలా ఉండేదని చాలా మంది చర్చించుకుంటున్నారు. ఈ సందేహాలపై  ఫోటోగ్రాఫర్ బీకీపర్స్ డాన్ వింటర్స్ క్లారిటీ ఇచ్చాడు. తేనెటీగలు కుట్టకుండా.. నిదానంగా ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు.


నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్‌ సహకారంతో ఈ ఫోటో షూట్‌ చేశామని తెలిపారు. ఈ షూట్ కోసం ఇటాలియన్ తేనెటీగలను ఉపయోగించారని.. అలాగే సెట్లో ఉన్న సిబ్బంది రక్షణ కోట్స్ ధరించారని.. కేవలం ఏంజెలీనాకు మాత్రమే సూట్ వేయలేదని చెప్పారు. అలాగే తేనెటీగలు కుట్టకుండా ఉండటానికి సెట్ లో నిశ్శబ్ధం.. చీకటిగా ఉండేలా ఏర్పాట్లు చేశారని తెలిపారు. ‘ఈ ఫోటో షూట్ కోసం.. కీటక శాస్త్రవేత్త అయిన అవెడాన్ నుంచి అనుమతి తెచ్చుకున్నాము. ఏంజెలీనా దీని కోసం చాలా రిస్క్ చేసింది’ అంటూ డాన్ వింటర్స్ చెప్పుకొచ్చాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top