'విశ్వంభర' సెట్‌లో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి.. ఫొటోలు వైరల్ AP Tourism, Culture, and Cinematography Minister Kandula Durgesh met Megastar Chiranjeevi on the sets of Vishwambhara. Sakshi
Sakshi News home page

Vishwambhara: సినిమాటోగ్రఫీ మంత్రితో చిరంజీవి భేటీ.. ట్వీట్ వైరల్

Published Thu, Jun 20 2024 10:09 AM | Last Updated on Thu, Jun 20 2024 10:57 AM

Andhra Pradesh Cinematography Minister Met Chiranjeevi Vishwambhara Set

ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌ని మెగాస్టార్ చిరంజీవి కలిశారు. హైదరాబాద్‌లోని 'విశ్వంభర' సెట్‌లో ఇది జరిగింది. చిరుతో పాటు కీరవాణి, దర్శకుడు వశిష్ట, నిర్మాతలు కూడా మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా చిరు.. మంత్రి దుర్గేష్‌తో కాసేపు ముచ్చటించారు. అలానే ఈ భేటీ విషయమై ట్విట్టర్(ఎక్స్)లో పోస్ట్ పెట్టారు.

(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ఆనంద్ దేవరకొండ సినిమా)

'మిత్రుడు కందుల దుర్గష్.. ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న సందర్భంగా 'విశ్వంభర' సెట్స్‌పై ఆయనకు స్వాగతం పలకడం ఎంతో ఆనందంగా ఉంది. మంత్రిగా ఆయన సంపూర్ణ విజయం సాధించాలని నా శుభాకాంక్షలు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి, ఎదుర్కొంటున్న సవాళ్లని సత్వరం పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటారని చెప్పారు' అని చిరంజీవి రాసుకొచ్చారు.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 11 మూవీస్.. మొత్తంగా 17 రిలీజ్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement