Anchor Suma Son Roshan 2nd Movie With Two Young Directors, FDeets Inside - Sakshi
Sakshi News home page

Anchor Suma: సుమ కొడుకు జోరు, అప్పుడే రెండో సినిమాను కూడా లైన్లో పెట్టేశాడు!

Apr 11 2022 8:17 AM | Updated on Apr 11 2022 9:59 AM

Anchor Suma Son Roshan 2nd Movie With Two Young Directors - Sakshi

Anchor Suma Son Roshan 2nd Movie With Two Directors: యాంకర్‌ సుమ, రాజీవ్‌ కనకాల తనయుడు రోషన్‌ త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. తమ సొంత నిర్మాణంలో రోషల్‌ హీరోగా ఓ సినిమా చేయడబోతున్నాడు. ఇప్పటి వరకు అయితే ఈ మూవీ సెట్స్‌పైకి రాకముందే రోషన్‌ తన రెండో సినిమాను లైన్‌లో పెట్టినట్టు సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా పై చదువుల కోసం అమెరికా వెళ్లిన రోషన్‌ ఇటీవల ఇండియా తిరిగి వచ్చాడు. ఇక వచ్చి రాగానే హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు తనని తాను సిద్ధం చేసుకుంటాడు.  

చదవండి: ఏడో తరగతిలో అలా చేయడం.. అదే తొలిసారి, చివరిసారి: దీపికా పదుకొణె

అంతేకాదు కొడుకును ఎప్పుడెప్పుడు సినిమాల్లో తీసుకుద్దామని సుమ, రాజీవ్‌లు కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నారట. ఈ క్రమంలో ఇప్పటికే విజయ్ అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేస్తున్న రోషన్ ఈ మూవీ ఇంకా స్టార్ట్‌ కాకుండానే తాజాగా రెండో సినిమాకు చర్చలు జరుపుతున్నట్లు వినికిడి. ఇందుకోసం ఇద్దరు యంగ్ డైరెక్టర్లను తన రెండో సినిమా కోసం లైన్‌లో పెట్టాడని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు యువ దర్శకుడు విరించి వర్మ దర్శకత్వం వహించగా.. మరో యంగ్ టాలెంటెడ్‌ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథను అందించనున్నాడని సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement