ఇది ఏంటో చెప్పుకోండి చూద్దాం అంటూ ఫన్నీ వీడియోను షేర్‌ చేసిన సుమ

Anchor Suma Shares Funny Video On Actress Tejashwini Gowda - Sakshi

సుమ కనకాల.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తికాదు.  దాదాపు రెండు దశాబ్దాలుగా యాంకరింగ్‌లో త‌న‌కు ఎవ‌రూ సాటి లేర‌న్న విధంగా ముందుకు సాగుతున్నారు. ఏ కార్య‌క్ర‌మం, ఆడియో ఫంక్ష‌న్‌, ఈవెంట్ అయిన యాంక‌ర్‌గా సుమ ఉండాల్సిందే. ఇక బుల్లితెరపైనే కాదు సోషల్‌ మీడియాలోనూ సుమ చాలా యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే.ఫన్నీ వీడియోలతో పాటు వంట వీడియోలు చేస్తూ తన అభిమానులను ఎంటర్టైన్ చేయడంలో ముందుటుంది. తాజాగా ఓ సీరియల్‌ నటి చేసిన పనిని షేర్‌ చేస్తూ..ఇది ఏంటో చెప్పుకోండి చూద్దాం అంటూ ఓ ఫన్నీ వీడియోను షేర్‌ చేశారు.

ఇటీవలె సీరియల్‌ ఆర్టిస్టులు సుహాసిని, వైష్ణవి, తేజస్విని, మోనిష్‌ తాను హోస్ట్‌ చేసిన షోకు వచ్చారని, ఈ సందర్భంగా మెహిందీ టాస్క్‌ ఇచ్చినట్లు సుమ తెలిపింది. అయితే టాస్క్‌లో భాగంగా నటి తేజస్విని తన చేతిపై గడ్డి తింటున్న ఆవు అంటూ ఓ డిజైన్‌ వేసిందని, ఇది ఏ కోశాన కూడా అలా కనిపించడం లేదంటూ నటి పరువు తీసేసింది. రియల్‌ మెహిందీ కావడంతో ఇంకా పోవడం లేదని, ఇది ఎప్పుడు పోతుంది తేజూ అంటూ సుమ ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఇక నటి తేజూ కూడా అక్కా.. అంటూ ఫన్నీ ఎమోజీని కామెంట్‌ రూపంలో తెలియజేసింది. ప్రస్తుతం సుమ షేర్‌ చేసిన ఈ వీడియోపై నెటిజన్లు కూడా అది ఆవులా అస్సలు లేదని ఫన్నీగా బదులిస్తున్నారు.  

చదవండి : ఒక్క వీడియోతో ట్రోలర్స్‌ నోరు మూయించిన సుమ కనకాల
భర్త డైలాగ్‌ చెప్పి ధైర్యం నూరిపోసిన సుమ.. వీడియో వైరల్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top