Anchor Shyamala Talk About Ram Gopal Varma In Live Chat - Sakshi
Sakshi News home page

Anchor Shyamala: లైవ్‌చాట్‌లో ఆర్జీవీపై ప్రశ్న, ఏం చెప్పిందంటే..

Mar 7 2022 10:23 AM | Updated on Mar 7 2022 12:55 PM

Anchor Shyamala About Ram Gopal Varma In Live Chat - Sakshi

టాలీవుడ్‌ యాంకర్‌ శ్యామల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.  టీవీ షోలతో పాటు పలు ఆడియో ఫంక్షనకు తనదైన స్టైల్‌లో యాంకరింగ్‌ చేస్తుంటుంది. సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్‌ చేస్తుంటుంది. అలాగే వీలు చిక్కినప్పుడల్లా ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తుంది. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా లైవ్‌చాట్‌కు వచ్చిన శ్యామలకు ఫ్యాన్స్‌ నుంచి రకరకాల ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సందర్భంగా ఓ నెటిజన్‌ డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ గురించి అడగ్గా శ్యామల తనదైన శైలిలో రిప్లై ఇచ్చింది.

చదవండి: అల్లు అర్జున్-స్నేహ వివాహ బంధానికి పదకొండేళ్లు.. బన్నీ స్వీట్​ విషెస్​

వర్మ గురించి చెప్పమనగానే శ్యామల.. ‘నో కామెంట్స్‌.. కానీ ఆయన గొప్ప దర్శకుడు. ఒకప్పుడు వర్మ చిత్రాలకు పెద్ద అభిమానిని’ అని సమాధానం ఇచ్చింది. ఇది చూసిన నెటజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అంటే పరోక్షంగా ఇప్పుడు వర్మ మంచి సినిమాలు తీయడం లేదా? ఒకప్పుడు అంటే ఇ‍ప్పుడు వర్మ దర్శకుడిగా ఫాం కోల్పోయాడని మీ ఉద్దేశమా? అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా ఇటీవల ఓ మూవీ ఈవెంట్‌లో ఆర్జీవీ యాంకర్‌ శ్యామలపై రొమాంటిక్‌ కామెంట్స్‌ చేయడం హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. 'ఇంత అందంగా ఉన్న మీరు నా కళ్లలోంచి ఎలా తప్పించుకున్నారు' అంటూ శ్యామలను సరదాగా ప్రశ్నించాడు. దీంతో ఒక్కక్షణం షాక్‌ అయిన శ్యామల ఆ తర్వాత తెగ నవ్వేసింది. 

చదవండి: 'రాధేశ్యామ్‌' మూవీ ఫస్ట్‌ రివ్యూ వచ్చేసింది..

Advertisement
 
Advertisement
Advertisement