Anchor Jhansi About Her Real Life Struggles In Industry - Sakshi
Sakshi News home page

Anchor Jhansi : 'నాకు దక్కాల్సిన క్రెడిట్‌ రాకుండా చేశారు.. కానీ కక్ష పెట్టుకోలేదు'

May 8 2023 4:10 PM | Updated on May 8 2023 5:13 PM

Anchor Jhansi About Her Real Life Struggles In Industry - Sakshi

యాంకర్‌ ఝాన్సీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సుమ తర్వాత ఇండస్ట్రీలో ఆ స్థాయిలో పేరు సంపాదించుకుంది ఝాన్సీ. ఒకప్పుడు స్టార్‌ యాంకర్‌గా బుల్లితెరపై ఎన్నో సక్సెస్‌ఫుల్‌ కార్యక్రమాలు హోస్ట్‌ చేసిన ఆమె సినిమాల్లోనూ మంచి క్రేజ్‌ను దక్కించుకుంది. ఈమధ్య బుల్లితెరపై ఈమె హడావిడి కాస్త తగ్గినా వెండితెరపై మాత్రం జోరు కొనసాగిస్తుంది.

ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె కెరీర్‌లో తనకు ఎదురైన చేదు సంఘటనల గురించి పంచుకుంది. ''నా గురించి కొత్తలో చాలామంది ఈమె ఫైర్‌ బ్రాండ్‌, పొగరు ఇలా.. అనుకునేవారు. కానీ నాతో కలిసి పనిచేసిన వారికి తెలుసు నేను ఏంటన్నది. నన్ను అర్ధం చేసుకున్నవారు కొన్నేళ్ల పాటు నాతో జర్నీ చేశారు. నచ్చని వాళ్లు 13 ఎపిసోడ్స్‌తోనే ఫుల్‌స్టాప్‌ పెట్టేశారు.

ఇంకా దారుణం ఏమిటంటే.. ఓ డ్యాన్స్‌ షోకి 99కి ఎపిసోడ్స్‌ నేను యాంకర్‌గా చేస్తే 100వ ఎపిసోడ్‌కి నా స్థానంలో వేరేవాళ్లతో యాంకరింగ్‌ చేయించారు. దానికి కారణం ఏంటన్నది నాకు చెప్పరు. నేను అడగలేదు. నాకు రావలసిన క్రెడిట్ నాకు రాకుండా చేసిన సందర్భాలు బోలెడు ఉన్నాయి. నన్ను ఎంతోమంది మోసం చేశారు. కానీ వాళ్లందరిని గుర్తు పెట్టుకొని కక్ష సాధించే పని నేను ఎప్పుడూ చేయలేదు. అది మంచితనమో, పిచ్చతనమో తెలియదు'' అంటూ చెప్పుకొచ్చింది ఝాన్సీ. 

Advertisement
 
Advertisement
Advertisement