
టాలీవుడ్ నటి, యాంకర్ అనసూయ ఇటీవలే ప్రేమ విమానం చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. తనదైన నటనతో మరోసారి అభిమానులను కట్టిపడేసింది. ప్రస్తుతం అనసూయ పుష్ప-2 చిత్రంలో నటిస్తోంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తోన్న పుష్ప సీక్వెల్ వచ్చే ఏడాది ఆగస్టు 15న థియేటర్లలో సందడి చేయనుంది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే రంగమ్మత్త తాజాగా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మహర్షి వాల్మీకి రచించిన రామాయణంలోని ఓ కొటేషన్‌ను షేర్ చేసింది. రామాయణంలోని యుద్ధకాండలో మహిళ గురించి శ్రీరాముడు చెప్పిన వాక్యాన్ని ట్వీట్‌లో ప్రస్తావించింది. 'ఇల్లు, దుస్తులు, ఇంటి గోడలు, తలుపులతో పాటు ఇంకా విలువైనవి కేవలం స్త్రీని కనిపించకుండా మాత్రమే కాపాడగలవు. కానీ ఆమె క్యారెక్టర్ మాత్రమే కవచంలా పనిచేసి ఆమెను రక్షిస్తుంది' అంటూ పోస్ట్ చేసింది.
— Anasuya Bharadwaj (@anusuyakhasba) December 19, 2023