మగాడిలా ఉన్నానని కామెంట్‌ చేశారు: అనన్య పాండే

Ananya Panday Said She Being Body Shamed On Social Media - Sakshi

ఈ మధ్య కాలంలో స్టార్‌ హీరోయిన్స్‌ నుంచి సాధారణ నటీమణుల వరకు సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌కు గురవుతున్నారు. ఇందులో బాలీవుడ్‌ నటీనటులే ఎక్కువగా ఉంటున్నారు. ఇటీవల హీరోయిన్‌ సోనాక్షి సిన్హా, దీపికా పదుకునేతో పాటు మరికొందరూ నటీమణులు ట్రోలర్స్‌ బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే కూడా ఈ జాబితాలో చేరింది. సోషల్‌ మీడియాలో తను బాడీ షేమింగ్‌ను ఎదుర్కొన్నట్లు ఇటీవల ఓ ఇంటర్య్వూలో వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. ‘గతంలో నేను చాలాసార్లు ట్రోల్స్‌ బారిన పడ్డాను. వారు నా శరీరాన్ని అబ్బాయిల శరీరంతో పోలుస్తూ బాడి షేమింగ్‌ చేసేవారు. అది నన్ను తీవ్రంగా బాధించేది’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

అంతేగాక ‘అప్పుడప్పుడే నేను హీరోయిన్‌గా సినిమాల్లోకి ఏంట్రీ ఇచ్చాను. అదే సమయంలో నేను బక్క పలుచగా, ప్లాట్‌గా కనిపిస్తున్నానని,  అచ్చం అబ్బాయిల శరీరాకృతిలా నా శరీరం కనిపిస్తుంది అంటూ విమర్శించేవారు. అవి నన్ను వీపరితంగా బాధించేవి. ఎందుకంటే కేరీర్‌లో ఆత్మవిశ్వాసంతో ముందుకేళ్లాల్సిన సమయంలో ఈ ట్రోల్స్‌ నన్ను కుంగదీసేవి. దీంతో నేను మరింత బలహీనురాలిగా అయిపోయేదాన్ని’ అంటూ చేదు జ్ఞాపకాలను పంచుకున్నారు. ఇక ఆ తర్వాత ఈ ట్రోల్స్‌ను సాధారణంగా చూడటం మొదలు పెట్టానని. మొదట్లో అవి బాధించిన ఆ తర్వాత వాటిని ఎంజాయ్‌ చేయడం నేర్చుకున్నాను అన్నారు. ఎందుకంటే తనని తాను ప్రేమించుకోవడం మొదలు పెట్టానన్నారు.

అలాంటప్పుడే ఇలాంటి విమర్శలు ఎప్పటికి తనను బాధించవంటూ ఆమె చెప్పకొచ్చారు. కాగా అనన్య 2019లో షారుఖ్‌ ఖాన్‌ కూతురు సుహానే ఖాన్‌, సంజయ్‌ కపూర్‌ కూతురు షనయా కపూర్‌లతో కలిసి సో పాజిటివ్‌ పేరుతో సోషల్‌ మీడియాలో ప్రచారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సోషల్‌ మీడియా వచ్చే బెదిరింపులను, విమర్శలను అరికట్టాలంటూ ఆమె అభిమానులను కోరారు. ఈ క్రమంలో ఆమె ‘చార్లీస్‌ ఎంజెల్స్‌ ’ పేరు చేసిన ట్వీట్‌లో ఎంజెల్స్‌ స్పెల్లింగ్‌ను తప్పుగా రాసి పోస్టు చేసింది. దీంతో నెటిజన్లు ఆమెను వీపరీతంగా ట్రోల్‌ చేయడం ప్రారంభిచడంతో అది డిలీట్‌  చే సి తిరిగి మళ్లీ పోస్టు చేసింది. 

చదవండి: 
పవన్‌ కల్యాణ్‌ న్యూలుక్‌.. షాక్‌ అవుతున్న ఫ్యాన్స్‌ 
తెలుగు తెరపై బాలీవుడ్‌ భామల గ్రాండ్‌ ఎంట్రీ

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top