లవ్‌ డ్యూయెట్‌  | Anand Deverakonda DUET movie Grand Opening Ceremony | Sakshi
Sakshi News home page

లవ్‌ డ్యూయెట్‌ 

Nov 3 2023 2:15 AM | Updated on Nov 3 2023 2:15 AM

Anand Deverakonda DUET movie Grand Opening Ceremony - Sakshi

రితిక, ఆనంద్‌ దేవరకొండ

ఆనంద్‌ దేవరకొండ, రితికా నాయక్‌ జంటగా నటించనున్న సినిమాకు ‘డ్యూయెట్‌’ టైటిల్‌ను ఖరారు చేశారు. ఏఆర్‌ మురుగదాస్‌ దగ్గర అసిస్టెంట్‌గా చేసిన మిథున్‌ వరదరాజ కృష్ణన్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, స్టూడియో గ్రీన్‌ పతాకంపై కేజీ జ్ఞానవేల్‌ రాజా ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాప్రారంభోత్సవం గురువారం జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి ఆనంద్‌ తల్లిదండ్రులు గోవర్ధన్‌ దేవరకొండ, మాధవి కెమెరా స్విచ్చాన్‌ చేయగా, హీరో హీరోయిన్లపై దర్శకుడు హరీష్‌ శంకర్‌ క్లాప్‌ ఇచ్చారు.

తొలి సీన్‌కి దర్శకుడు చందు మొండేటి గౌరవ దర్శకత్వం వహించగా, దర్శక–నిర్మాత సాయిరాజేష్, నిర్మాత జ్ఞానవేల్‌ రాజా, ఈ చిత్ర సహ–నిర్మాత ‘మధుర’ శ్రీధర్‌ స్క్రిప్ట్‌ను దర్శకుడు మిథున్‌కు అందజేశారు. ఆనంద్‌ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘డ్యూయెట్‌’ నాకు స్పెషల్‌ ఫిల్మ్‌. మిథున్‌ మంచి కథ రాశాడు’’ అన్నారు. ‘‘ఇదొక మంచి లవ్‌స్టోరీ’’ అన్నారు మిథున్‌.

‘‘ఈ కథ విన్నప్పుడు భావోద్వేగానికి లోనయ్యాను. జీవీ ప్రకాశ్‌కుమార్‌ ఆల్రెడీ రెండు పాటలు ఇచ్చేశారు. వారం రోజుల్లో తొలి షెడ్యూల్‌ ఆరంభిస్తాం’’ అన్నారు. ఈ వేడుకకు హీరోలు విజయ్‌ దేవరకొండ, సత్యదేవ్‌ అతిథులుగా హాజరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement