Amrita Rao: లక్షన్నరలో పెళ్లి చేసుకున్న హీరోయిన్‌.. పెళ్లి చీర రూ.3 వేలు మాత్రమేనట!

Amrita Rao Wore RS 3000 Saree For Her Wedding - Sakshi

పెళ్లి అనేది మన జీవితంలో ఓ మధురమైన ఘట్టం. అందుకే గుర్తిండిపోయేలా చాలా అట్టహాసంగా పెళ్లి తంతు జరుపుకోవాలని ప్రతి ఒక్కరు కలలు కంటారు. పేదవాడు సైతం తన స్తోమతకు మించి ఖర్చు చేసి పెళ్లి చేసుకుంటాడు. ఇక సెలబ్రిటీల పెళ్లి గురించి చెప్పనక్కర్లేదు. కోట్లలో ఖర్చు చేసి అందరూ చర్చించుకునేలా అట్టహాసంగా తమ పెళ్లి  జరుపుకుంటారు. కానీ బాలీవుడ్ బ్యూటీ అమృతా రావు మాత్రం అందుకు తాము మినహాయింపు అంటుంది. కేవలం లక్షన్నర రూపాయల్లో తమ పెళ్లి జరిగిపోయిందటుంది.

కెరీర్‌ పీక్స్‌లో ఉండగానే 2016లో ఆర్జే అన్ మోల్ ను ను అమృతా రావు పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సినిమాలకు దూరం అయ్యింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమ పెళ్లి గురించి మాట్లాడుతూ..  ‘కొద్దిమంది దగ్గరి బంధువులు, మిత్రుల సమక్షంలోనే మా పెళ్లి జరిగింది. పెళ్లి తంతు కోసం మేం కేలవం రూ. 1.5లక్షలు మాత్రమే ఖర్చు చేశాం. పెళ్లి బట్టలు, ప్రయాణ ఖర్చులు, కల్యాణ వేదిక.. ఇవన్నీ ఆ డబ్బుతోనే సర్దుకున్నాం. పెళ్లికి నేను ధరించిన చీర ధర కేవలం రూ.3000 మాత్రమే.

(చదవండి: ఆ దేవుడు నన్ను కరుణించలేదు: జబర్దస్త్‌ యాంకర్‌ ఎమోషనల్‌)

పెళ్లి వేదిక కోసం రూ. 11 వేలు ఖర్చు చేశాం. భోజనాలు, ప్రయాణ ఖర్చులతో కలిపి మొత్తం లక్షన్నరలో మా పెళ్లి జరిగిపోయింది’అని అమృతా రావు చెప్పుకొచ్చింది. 2002లో ‘అబ్‌ కే బరాస్‌’ చిత్రంతో హీరోయిన్‌గా బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది అమృతా రావు. మహేశ్‌ బాబు ‘అతిథి’ సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీతో గడిపేస్తుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top