‘అమ్మాయిలు అర్థం కారు’.. ఫస్ట్‌లుక్‌ విడుదల | Ammayilu Artham Karu Movie First Look Released | Sakshi
Sakshi News home page

నాలుగు జంటల ప్రేమకథే.. ‘అమ్మాయిలు అర్థం కారు’

Nov 4 2022 10:14 AM | Updated on Nov 4 2022 10:15 AM

Ammayilu Artham Karu Movie First Look Released - Sakshi

‘1940లో ఒక గ్రామం, కమలతో నా ప్రయాణం, జాతీయ రహదారి’ వంటి చిత్రాల ఫేమ్‌ నరసింహ నంది దర్శకత్వం వహించిన చిత్రం ‘అమ్మాయిలు అర్థం కారు’. అల్లం శ్రీకాంత్, ప్రశాంత్, కమల్, మీరావలి హీరోలుగా, సాయిదివ్య, ప్రియాంక, స్వాతి, శ్రావణి హీరోయిన్లుగా నటించారు. నందిరెడ్డి విజయలక్ష్మిరెడ్డి, కర్ర వెంకట సుబ్బయ్య నిర్మించారు. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ ప్రధాన కార్యదర్శి టి. ప్రసన్న కుమార్‌ విడుదల చేశారు.

నరసింహ నంది మాట్లాడుతూ– ‘‘నాలుగు జంటల ప్రేమకథలో ఏర్పడే మలుపులు, భావోద్వేగాలతో ఈ సినిమా ఉంటుంది. మధ్యతరగతి జీవితాల్లో డబ్బు ఎలాంటి పాత్ర పోషిస్తుంది? దానివల్ల జీవితాలు ఎలా తారుమారవుతాయి? అనే అంశాన్ని చర్చించాం’’ అన్నారు. ‘‘చిత్తూరు, తిరుపతి ప్రాంతాల యాస నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు కర్ర వెంకట సుబ్బయ్య.

Advertisement
 
Advertisement
Advertisement