విజేతను కూడా ఓటమి పలకరిస్తుంది | Amitabh Bachchan sparks health concerns over blogs post on hospitalisation | Sakshi
Sakshi News home page

విజేతను కూడా ఓటమి పలకరిస్తుంది

Jul 22 2026 3:40 AM | Updated on Jul 22 2026 3:40 AM

Amitabh Bachchan sparks health concerns over blogs post on hospitalisation

శస్త్ర చికిత్స తర్వాత బ్లాగ్‌లో అమితాబ్‌

ఎప్పటికప్పుడు తన అనుభవాలను, అభిప్రాయాలను అమితాబ్‌ బచ్చన్‌ బ్లాగ్‌లో షేర్‌ చేసుకుంటారన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన షేర్‌ చేసిన ఓ పోస్ట్‌ అభిమానులను కలవరపెట్టింది. ‘‘శస్త్రచికిత్స, ఐసీయూలో నిపుణులైన వైద్యులు, వైద్య సిబ్బంది సంరక్షణ, ఆ తర్వాత డిశ్చార్జ్, ఇంటికి చేరుకోవడం’’ అంటూ తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు అమితాబ్‌. ఈ పోస్ట్‌తో ఆయనకు శస్త్రచికిత్స జరిగిందన్న విషయం స్పష్టమైంది.

కానీ అమితాబ్‌కు ఎందుకు శస్త్రచికిత్స జరిగింది? ఎప్పుడు, ఎక్కడ జరిగింది? అనే విషయాలపై స్పష్టత లేదు. అలాగే ఈ బ్లాగ్‌ పోస్ట్‌లోనే భావోద్వేగంగా స్పందించారు అమితాబ్‌. ‘‘డిశ్చార్జ్‌ అయి, తిరిగి ఇంటికి చేరుకున్న తర్వాత ఎదురయ్యే సవాళ్లు కఠినమైనవి. శారీరకంగానే కాదు... మానసికంగానూ ఎన్నో పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరెంతటి గొప్ప విజేత అయినా ఏదో ఒక రోజు ఓటమి మిమ్మల్ని పలకరిస్తుంది. కొందరు ధైర్యంగా దాన్ని ఎదుర్కొంటారు... మరికొందరు లొంగిపోతారు. అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి’’ అంటూ అమితాబ్‌ రాసుకొచ్చారు. ఈ నేపథ్యంలో అమితాబ్‌ కోలుకోవాలని ఆశిస్తూ సోషల్‌ మీడియాలో ఆయన ఫ్యాన్స్, నెటిజన్లు షేర్‌ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement