గంగారామ్‌.. నువ్వు సూపర్‌!: అమితాబ్‌

Amitabh Bachchan Praises Abhishek Bachchan Over Dasvi Movie - Sakshi

‘‘సూపర్‌.. బాగుంది’’ అంటూ తనయుడు అభిషేక్‌ బచ్చన్‌కి కితాబులిచ్చారు అమితాబ్‌ బచ్చన్‌. ఇంతకీ కుమారుడిని బిగ్‌ బి ఎందుకు ప్రశంసించారంటే.. అభిషేక్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘దస్వీ’ లుక్‌ విడుదలైంది. ఈ లుక్‌ బాగుందన్నారు అమితాబ్‌. ‘దస్వీ’ అంటే టెన్త్‌ గ్రేడ్‌. ఈ చిత్రంలో అభిషేక్‌ పదో తరగతి ఫెయిలవుతాడు. అయితే ముఖ్యమంత్రి అవుతాడు. క్యారెక్టర్‌ పేరు గంగారామ్‌ చౌదరి.

తుషార్‌ జలోటా దర్శకత్వంలో రూపొందుతున్న పొలిటికల్‌ సెటైరికల్‌ మూవీ ఇది. ఈ సినిమా తాజా ఫొటోను ‘దస్వీ కా దస్వా దిన్‌’ (దస్వీకి పదో రోజు) అంటూ అభిషేక్‌ రిలీజ్‌ చేశారు. తెల్ల కుర్తా–పైజామా, కోటు, తలపాగాతో సింహాసనం మీద దర్జాగా కూర్చుని ఉన్న గంగారామ్‌ లుక్‌కి బోలెడన్ని ప్రశంసలు లభించాయి. పది రోజులుగా ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. అందుకే ‘దస్వీ’ సెట్లో పదో రోజు అంటూ ఫొటోను విడుదల చేశారు.

చదవండి: రౌడీగా మారిన అభిషేక్‌.. సీఎం అవుతాడట!

ఐస్‌క్రీమ్‌ తింటున్న స్టార్‌ హీరోను గుర్తుపట్టారా?

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top