Dasvi Poster: Abhishek Bachchan Dasvi Movie First Look Poster Released | రౌడీగా మారిన అభిషేక్‌.. సీఎం అవుతాడట! - Sakshi
Sakshi News home page

రౌడీగా మారిన అభిషేక్‌.. సీఎం అవుతాడట!

Feb 23 2021 9:09 AM | Updated on Feb 23 2021 1:19 PM

Abhishek Bachchan Dasvi First Look Poster Out - Sakshi

అభిషేక్‌ బచ్చన్‌ హీరోగా తెరకెక్కుతున్న హిందీ చిత్రం ‘దస్వీ’. తుషార్‌ జొలాతా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ సోమవారం ప్రారంభం అయింది. ఈ సినిమాలో అభిషేక్‌ బచ్చన్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు. ఇందులో టెన్త్‌ ఫెయిల్‌ అయిన గంగా రౌమ్‌ చౌదరి అనే రౌడీగా అభిషేక్‌ బచ్చన్‌ కనిపించనున్నారు.

అక్షరం ముక్క రాకపోయినా ముఖ్యమంత్రి అవ్వాలనే కలలు కనే పాత్ర అతనిదని బాలీవుడ్‌ టాక్‌. యామీ గౌతమ్‌ కథానాయిక. ఆమె పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఢిల్లీలోని ఆగ్రాలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది.

చదవండి : 
బాయ్‌ ఫ్రెండ్‌తో శృతిహాసన్‌ మ్యూజిక్‌ వీడియో 

దృశ్యం 2: అజయ్‌ కూడా తప్పించుకుంటాడు

Advertisement
 
Advertisement
Advertisement