Amazon Prime Video: అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్స్‌కు సూపర్‌ గుడ్ న్యూస్‌..

Amazon Prime Video Upcoming Web Series And Movies Over 40 - Sakshi

Amazon Prime Video Upcoming Web Series And Movies Over 40: కరోనా, లాక్‌డౌన్‌ తర్వాత ఓటీటీ వినియోగం బాగా పెరిగిపోయింది. థియేటర్లకు ప్రత్యమ్నాయంగా మారాయి ఓటీటీలు. పెద్ద సినిమాల నుంచి చిన్న చిత్రాల వరకు విడుదల చేసేందుకు చిరునామా అయ్యాయి. సినిమాలతోపాటు వాటిని తలదన్నేలా వెబ్‌ సిరీస్‌లు కూడా తెరకెక్కాయి. ఇంకా తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో తన సబ్‌స్క్రైబర్లకు సూపర్‌ గుడ్ న్యూస్‌ తెలిపింది. ఇక ఈ వినియోగదారులకు వెబ్‌ సిరీస్‌లు, సినిమాలతో పండగే పండగ. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో రానున్న రెండేళ్లలో సుమారు 40 ఒరిజినల్‌ వెబ్‌ సిరీస్‌/సినిమాలను ప్రేక్షకులకు అందించనున్నట్లు ప్రకటించింది. తెలుగు, తమిళ, హిందీతోపాటు వివిధ భాషల్లో వీటిని నిర్మించనున్నట్లు పేర్కొంది. వాటి వివరాలను ఓ వీడియో ద్వారా వెల్లడించింది.

ఈ వెబ్‌ సిరీస్‌లు/సినిమాలను కరణ్‌ జోహార్‌ ధర్మ ఎంటర్‌టైన్‌మెంట్‌, రితేశ్ సిద్వానీ-పర్హాన్ అక్తర్‌లకు చెందిన ఎక్సెల్ మీడియా, నిఖిల్‌ అడ్వానీ ఎమ్మీ ఎంటర్‌టైన్‌మెంట్‌, రాజ్‌ అండ్‌ డీకే ఫిల్మ్స్‌ ఇలా తదితర నిర్మాణ సంస్థలతో కలిసి తెరకెక్కిస్తున్నట్లు తెలిపింది. మొత్తం 22 ఒరిజినల్‌ స్క్రిప్టెడ్‌ సిరీస్‌, 9 రిటర్నింగ్‌ సిరీస్‌, 3 అమెజాన్‌ ఒరిజినల్‌ ఫిల్మ్స్‌, 2 కో-ప్రొడక్షన్స్‌ వాటిలో ఉన్నాయి. ఇందులో నాగ చైతన్య హీరోగా విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో దూత వెబ్‌ సిరీస్‌, ఆది పినిషెట్టి, నిత్యా మీనన్‌, రీతు వర్మ, సుహాసిని, అభిజిత్ (బిగ్‌బాస్‌ ఫేం) తదితరులు నటించిన మోడర్న్‌ లవ్‌ వెబ్‌ సీరీస్‌, అమ్ము అనే సినిమా త్వరలో స్ట్రీమింగ్‌ కానున్నట్లు పేర్కొంది. 

ఫర్జీ, సజల్‌, ది విలేజ్‌, హష్‌ హష్‌, ఫోన్‌ భూత్‌, యుద్రా, జీ లే జరా, ఫక్రీ 4, కో గయే హై హమ్‌ కహాన్‌, అక్షయ్ కుమార్, సత్యదేవ్‌ 'రామసేతు'తోపాటు సూపర్ హిట్‌ సిరీస్‌లు మీర్జాపూర్‌ 3, ది ఫ్యామిలీ మ్యాన్‌ 3, ఫోర్ మోర్ షాట్స్‌ ప్లీజ్ 3, ముంబై డైరీస్‌ 2, మేడ్ ఇన్‌ హెవెన్‌ 2, పాతాళ్‌ లోక్‌ 2, కామిక్‌స్తాన్‌ 3, బ్రీత్: ఇన్‌టు ది షాడోస్‌ సీజన్‌ 2, పంచాయతీ ఎస్‌2 కూడా నిర్మాణంలో ఉ‍న్నాయి. అలాగే రోహిత్ శెట్టి దర్శకత్వంలో సిద్ధార్థ్ మల్హోత్రా, శిల్పా శెట్టి, వెవేక్‌ ఒబేరాయ్‌, ఇషా తల్వార్‌ కీలక పాత్రల్లో నటించిన 'ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌' అనె వెబ్‌ సిరీస్‌ కూడా రానుంది. 

అమెజాన్ ప్రైమ్‌ వీడియో 'ట్రాన్సక్షనల్‌ వీడియో ఆన్‌ డిమాండ్‌' (టీవీఓడీ) పేరుతో సినిమాలను అద్దె ప్రాతిపదికన అందుబాటులోకి తీసుకురానుంది. ప్రైమ్ మెంబర్స్‌ కానీ వారికి టీవీఓడీ సేవలను వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం పలు స్ట్రీమింగ్‌ యాప్‌లు పేపర్ వ్యూ పద్ధతి ద్వారా మూవీస్‌ను అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే జీ5 టీవీఓడీని 'జీప్లెక్స్‌' పేరుతో అందుబాటులోకి తెచ్చింది. 

చదవండి: ఐఎమ్‌డీబీ రేటింగ్‌ ఇచ్చిన 10 బెస్ట్‌ తెలుగు వెబ్‌ సిరీస్‌లు..
ఈ 3 సినిమాల కోసం ఓటీటీల్లో ఫ్యాన్స్ వెయిటింగ్‌..

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top