అల్లు అర్జున్‌కు ఎలా అనుమతి ఇచ్చారు? | Allu Arjun Visited Kuntala Waterfalls With Family | Sakshi
Sakshi News home page

కుంటాల జలపాతం సందర్శించిన అల్లు అర్జున్‌

Sep 13 2020 10:20 AM | Updated on Sep 14 2020 9:59 AM

Allu Arjun Visited Kuntala Waterfalls With Family - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సినీ హీరో అల్లు అర్జున్‌ శనివారం కుటుంబ సమేతంగా కుంటాల జలపాతాన్ని సందర్శించారు. జలపాతం జాలువారే అందాలను తిలకించారు. అటవీశాఖ అధికారులు దగ్గరుండి జలపాతం విశిష్టతను, ఇక్కడి ప్రకృతి అందాల గురించి ఆయనకు వివరించారు. అనంతరం ఆదిలాబాద్‌ పట్టణ శివారులో గల హరితవనం పార్కులో సఫారీలో తిరుగుతూ అందాలను వీక్షించారు. అంతకు ముందు హరితవనం పార్కులో మొక్కలు నాటారు.

అయితే, కరోనా నేపథ్యంలో పర్యాటకులను అనుమతించని అధికారులు.. ప్రముఖులకు మాత్రం మర్యాదలు చేయడం ఏమిటన్న విమర్శలు స్థానికుల నుంచి వస్తున్నాయి. ఇటీవల నిర్మాత దిల్‌ రాజు కుటుంబంతో పాటు కుంటాల జలపాతాన్ని సందర్శించారు. జలపాతం వద్ద పర్యాటకులను అనుమతించని అటవీ శాఖ అధికారులు సెలబ్రిటిలు, ప్రముఖులకు మాత్రం దగ్గరుండి జలపాతం అందాలను చూపించడం ఏమిటని కూడా ప్రశ్నిస్తున్నారు. (చదవండి : మళ్లీ డ్రగ్స్‌ కలకలం.. తెరపైకి రకుల్)

ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisement
 
Advertisement
Advertisement