పుష్ప: తగ్గేదే లే అంటూ.. నాన్‌స్టాప్‌గా షూటింగ్‌! | Allu Arjun, Sukumar Pushpa Part 2 Shooting Starts On 20th October,2022 | Sakshi
Sakshi News home page

Pushpa Part 2: పుష్ప: తగ్గేదే లే అంటూ.. నాన్‌స్టాప్‌గా షూటింగ్‌!

Oct 12 2022 8:48 AM | Updated on Oct 12 2022 8:48 AM

Allu Arjun, Sukumar Pushpa Part 2 Shooting Starts On 20th October,2022 - Sakshi

హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందిన ‘పుష్ప’ తొలి భాగం ‘పుష్ప: ది రైజ్‌’ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ‘పుష్ప’ మలి భాగం ‘పుష్ప: ది రైజ్‌’పై మరింత దృష్టి పెట్టింది టీమ్‌. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను ఈ నెల 20న ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తగ్గేదే లే అంటూ.. నాన్‌స్టాప్‌గా షూటింగ్‌ చేయడానికి టీమ్‌ ప్లాన్‌ చేసిందని సమాచారం.

చదవండి: Suriya: ‘నాకు ఆ పాత్ర చేయడం ఇష్టం లేదు, ఆయన కోసమే ఒప్పుకున్నా’

ఈ షెడ్యూల్‌లోనే హీరో హీరోయిన్లు అల్లు అర్జున్, రష్మికా మందన్నాలు కూడా పాల్గొంటారని తెలిసింది. ఇందులో పుష్పరాజ్‌ పాత్రలో అల్లు అర్జున్, శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్నా నటిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న సినిమా ఇది. ఫాహద్‌ ఫాజిల్, ధనుంజయ, సునీల్, అనసూయ భరద్వాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.    

Advertisement
 
Advertisement
Advertisement