
90స్ జనరేషన్‌కి సూపర్ హీరోలు అనగానే స్పైడర్ మ్యాన్, 'శక్తిమాన్' గుర్తొస్తాయి. స్పైడర్ మ్యాన్ సినిమాల సంగతి కాసేపు పక్కనబెడితే 'శక్తిమాన్' స్టోరీతో అటు సీరియల్ గానీ మూవీస్ గానీ రాలేదు. కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌తో ఈ ప్రాజెక్ట్ తీస్తారనే టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు ఫైనల్‌గా అది అల్లు అర్జున్ చేతిలోకి వచ్చిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏంటి విషయం?
'పుష్ప 2' తర్వాత లెక్క ప్రకారం బన్నీ.. త్రివిక్రమ్‌తో సినిమా చేయాలి. భారీ బడ్జెట్‌తో మైథలాజికల్ మూవీ ఒకటి అనుకున్నారు. కానీ అది ఆలస్యమవుతూ వచ్చింది. మధ్యలో తమిళ దర్శకుడు అట్లీతో.. బన్నీ కొత్త సినిమాని అనౌన్స్ చేశాడు. ఇదో హాలీవుడ్ రేంజ్ సూపర్ హీరో తరహా సినిమా అని అనౌన్స్‌మెంట్ వీడియోతో క్లారిటీ ఇచ్చారు.
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 మూవీస్)
రీసెంట్‌గా బన్నీ చేయాల్సిన సినిమా ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ చేయబోతున్నట్లు క్లారిటీ వచ్చింది. దీంతో నెక్స్ట్ ఎవరితో చేస్తాడా అనే టైంలో రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్ పేరు ఇప్పుడు వినిపిస్తుంది. గతంలో ఇతడు 'మిన్నల్ మురళి' అని లోకల్ సూపర్ హీరో మూవీ ఒకటి తీశాడు. ఈ క్రమంలోనే బన్నీ-బాసిల్ కలిసి 'శక్తిమాన్' చేస్తారనే రూమర్ ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది.
అంతర్జాతీయ నిర్మాణ సంస్థలు ఓ రెండు కలిసి.. గీతా ఆర్ట్స్‌తో భారీ ఎత్తున నిర్మించబోతున్నారని అంటున్నారు. త్వరలో ప్రకటన రావొచ్చని మాట్లాడుకుంటున్నారు. మరి ఇప్పుడు వినిపిస్తున్నవన్నీ నిజమేనా? లేదంటే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందని డ్యామేజ్ కంట్రోల్ ఏమైనా చేస్తున్నారా అనిపిస్తుంది. కొన్నిరోజులు ఆగితే నిజమేంటనేది క్లారిటీ రావొచ్చు.
(ఇదీ చదవండి: 'రాజాసాబ్' టీమ్ వార్నింగ్.. అలా చేస్తే కఠిన చర్యలు)