'రాజాసాబ్' టీమ్ వార్నింగ్.. షేర్ చేస్తే కఠిన చర్యలు | Prabhas Rajasaab Teaser Online And Makers Issue Note | Sakshi
Sakshi News home page

Rajasaab Teaser: మూడు రోజుల ముందే ఇలా జరిగిందేంటి?

Jun 13 2025 1:16 PM | Updated on Jun 13 2025 1:28 PM

Prabhas Rajasaab Teaser Online And Makers Issue Note

ప్రభాస్ 'రాజాసాబ్' సినిమా టీజర్.. ఈ నెల 16న రిలీజ్ చేస్తామని కొన్నిరోజుల క్రితం ప్రకటించారు. దీంతో అభిమానులు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలో అనుకోనిది జరిగింది. ఎవరో టీజర్‌ని లీక్ చేశారు. దీంతో ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో మూవీ టీమ్ అలెర్ట్ అయిపోయింది. హెచ్చరిస్తూ ట్వీట్ చేసింది.

(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 మూవీస్) 

'రాజాసాబ్ కంటెంట్ ఎవరి సోషల్ మీడియాలోనైనా కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అలానే అకౌంట్ సస్పెండ్ చేస్తాం. అందరూ మాకు సహకరిస్తారని అనుకుంటున్నాం' అని మూవీ టీమ్ ట్వీట్ చేసింది. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాని ఈ ఏడాది డిసెంబరు 5న థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు కొన్నిరోజుల క్రితమే అనౌన్స్ చేశారు.

హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ నటించారు. సంజయ్ దత్ విలన్‌గా చేశాడు. తమన్ సంగీతమందించాడు. ఇప్పటికే చాన్నాళ్లుగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రంలో వీఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువగా ఉండటం వల్ల ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. మరో మూడు రోజుల్లో రాబోయే టీజర్‌తో మూవీ కంటెంట్ ఏంటనేది క్లారిటీ వస్తుంది.

(ఇదీ చదవండి: పులిలా నడవమని లోకేశ్ చెప్పేవాడు.. కమ్ముల మాత్రం: నాగార్జున)

Advertisement
 
Advertisement
Advertisement