అల్లు అర్జున్, అట్లీ సినిమా ఈ ఏడాది చివరిలో విడుదల కానుంది. అయతే, బన్నీ తదుపరి సినిమాపై అందరి చూపు ఉంది. ఈ క్రమంలో ఆయన మరోసారి తమిళ దర్శకుడికే ఛాన్స్ ఇచ్చారని తెలుస్తోంది. ప్రముఖ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో ఓ సినిమా రానుందనే టాక్ ఎప్పట్నుంచో వినిపిస్తున్న సంగతి తెలిసిందే.. నేడు అధికారికంగా ప్రకటన కూడా రానుందని ఇండస్ట్రీలో టాక్. ఒక వీడియోతో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

కొద్దిరోజుల క్రితమే లోకేశ్ కనగరాజ్ హైదరాబాద్‌కు రావడంతో ఈ వార్తలకు బలాన్ని ఇచ్చాయి. అల్లు అర్జున్‌ను ఆయన కలవడం వంటి పరిణామాల నేపథ్యంలో వీరి కాంబోలో సినిమా దాదాపు ఖరారు అయిందని టాక్. లోకేశ్ చెప్పిన కథ బన్నీకి నచ్చడంతో లైన్ క్లియర్ అయిందని సమాచారం. మైత్రీ మూవీమేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారని టాక్. అట్లీతో సినిమా పూర్తి అయిన తర్వాత వెంటనే లోకేశ్ ప్రాజెక్ట్‌లోకి బన్నీ జాయిన్ అయిపోతారని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించే అవకాశం ఉంది.


