
– అల్లు అరవింద్
‘‘సింగిల్’ సినిమా రషెస్ చూశాక మా గీతా ఆర్ట్స్‌లో మరో రెండు సినిమాలు చేయాలని శ్రీవిష్ణుకి చెక్ ఇచ్చాను. మనిషిగా, నటుడిగా తను అంత నచ్చాడు. సినిమా బాగుంటే మేము థియేటర్స్‌కి వస్తామని ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. ఇందుకు వారికి ధన్యవాదాలు’’ అన్నారు అల్లు అరవింద్. శ్రీవిష్ణు, కేతికా శర్మ, ఇవానా హీరో హీరోయిన్లుగా ‘వెన్నెల’ కిశోర్ కీలక పాత్ర పోషించిన చిత్రం ‘సింగిల్’. కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదలైంది.
శుక్రవారం నిర్వహించిన సక్సెస్ మీట్‌లో శ్రీవిష్ణు మాట్లాడుతూ– ‘‘సింగిల్’ కథని దాదాపు 15 మంది తిరస్కరించారు. వాళ్లందరికీ థ్యాంక్స్ (నవ్వుతూ). మంచి టీమ్‌తో చేస్తున్న ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ అయితే బాగుంటుందనుకున్నాను... అదే జరిగింది’’ అని తెలిపారు. ‘‘ఈ సినిమా విజయం ఇండస్ట్రీకి ఉపయోగపడింది’’ అన్నారు ‘బన్నీ’ వాసు. ‘‘సింగిల్’ని నా లైఫ్‌లో మర్చిపోలేను’’ అని కార్తీక్ రాజు చెప్పారు. ‘‘మా సినిమాకి ఇంత మంచి విజయం అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అని విద్య, భాను ప్రతాప, రియాజ్ చౌదరి తెలిపారు.