Allu Aravindh: మొదట ఆందోళన పడ్డా.. ఆ తర్వాత హ్యాపీ: అల్లు అరవింద్

‘‘ఊర్వశివో రాక్షసివో’ చిత్ర కథని తమ్మారెడ్డి భరద్వాజగారు అందించారు. ఈ సినిమా ప్రివ్యూ చూసిన తర్వాత ఆయన నుంచి నాకు వరుసగా కాల్స్ వచ్చాయి. తన కథను మేము సరిగ్గా తీయలేకపోయారని అంటారేమో అనుకుని మొదట టెన్షన్ పడ్డా.. కానీ, సినిమా చాలా బాగా తీశారని ఆయన చెప్పడంతో సంతోషపడ్డాం’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు.
చదవండి: స్టార్ హీరో సల్మాన్‌కు అనారోగ్యం.. షూటింగులు వాయిదా
అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్‌పై ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ సినిమా నవంబర్ 4న విడుదలకానుంది. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రంలో మధ్య తరగతి అబ్బాయిగా శిరీష్ బాగా నటించాడు. మా సినిమా చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు.
చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ‘కపట నాటక సూత్రధారి’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
‘‘దాసరి నారాయణరావు, బాలచందర్‌గార్లు మధ్య తరగతి సమస్యలను అందంగా, సరదాగా చెప్పేవారు. మళ్లీ ఇన్నాళ్లకు ‘ఊర్వశివో రాక్షసివో’లో చూపిస్తుండటం హ్యాపీ’’ అన్నారు తమ్మారెడ్డి భరద్వాజ. ‘‘యువత ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? అనే నేపథ్యంలో ఈ సినిమా తీశాం’’ అన్నారు రాకేష్ శశి. ‘‘ఇంటికెళ్లిన తర్వాత కూడా ప్రేక్షకులు మా మూవీ గురించి ఆలోచిస్తారు’’అన్నారు అల్లు శిరీష్.