నూతన నాయుడుపై సంచలన ఆరోపణలు

Allegations On Big Boss Contestent Nuthan Naidu - Sakshi

సాక్షి, విశాఖపట్నం: బిగ్ బాస్ సీజన్‌ 2 కంటెస్టెంట్‌ నూతన నాయుడుపై శిరోముండనం(గుండు గీయించడం) ఆరోపణలు సంచలనం సృష్టించాయి. నూతన నాయుడు తనను శిరోముండనం చేశారని దళిత యువకుడు కర్రి శ్రీకాంత్‌ పెందుర్తి పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధి సుజాతనగర్‌లో నూతన నాయుడు నివాసముంటున్నారు. అయితే గత నాలుగు నెలలుగా నూతన నాయుడు ఇంట్లో దళిత యువకుడు శ్రీకాంత్ పని చేస్తున్నారు. కాగా కరోనా వేళ ఆగస్టు ఒకటో తేదీ నుంచి నూతన నాయుడు ఇంట్లో శ్రీకాంత్ పని మానేసాడు.

కాగా, శ్రీకాంత్‌ చెప్పకుండా పనిమానేయడంతో నూతన నాయుడు శ్రీకాంత్‌కు ఫోన్‌ చేసి సెల్ ఫోన్ పోయింది, దాని గురించి మాట్లాడదాం, ఇంటికి రమ్మని పిలిచాడని పోలీసులకు శ్రీకాంత్‌ చెప్పాడు. ఈ నేపథ్యంలో ఇంటికి వచ్చిన శ్రీకాంత్‌కు గుండు కొట్టినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని నూతన నాయుడు బెదిరించినట్లు శ్రీకాంత్ తెలిపారు.  శ్రీకాంత్‌ ఫిర్యాదు మేరకు సంఘటనపై పెందుర్తి పోలీసులు విచారణ చేపట్టారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top