‘అల్లరి’ నరేశ్.. ఉగ్రం ఆరంభం | Sakshi
Sakshi News home page

‘అల్లరి’ నరేశ్.. ఉగ్రం ఆరంభం

Published Tue, Sep 6 2022 4:05 AM

Allari Naresh's Ugram Movie Motion Poster launch - Sakshi

‘నాంది’ వంటి హిట్‌ ఫిల్మ్‌ తర్వాత హీరో ‘అల్లరి’ నరేశ్, దర్శకుడు విజయ్‌ కనకమేడల కాంబినేషన్‌లో రూపొందుతున్న మరో సినిమా ‘ఉగ్రం’. ఈ చిత్రంలో మిర్నా మీనన్‌ కథానాయికగా నటిస్తున్నారు. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ సోమవారం ప్రారంభమైంది.

ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఓ గ్లింప్స్‌ వీడియోను చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. తూము వెంకట్‌ కథ అందించిన ఈ సినిమాకు అబ్బూరి రవి మాటలు రాస్తున్నారు. శ్రీ చరణ్‌ పాకాల సంగీతదర్శకత్వం వహిస్తుండగా, సిధ్‌ కెమెరామేన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement