
టాలీవుడ్‌లో కామెడీ తరహా సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేశ్.. ఇప్పుడు చాలా స్లో అయిపోయాడు. ఒకటి అరా సీరియస్ లేదా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తున్నప్పటికీ అనుకున్న ఫలితం దక్కట్లేదు. అయినా సరే మూవీస్ చేస్తూనే ఉన్నాడు. గతేడాది డిసెంబరులో చివరగా 'బచ్చలమల్లి' అనే రస్టిక్ మూవీలో కనిపించాడు. ప్రస్తుతం ఓ హారర్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు.
(ఇదీ చదవండి: నాకెందుకు ఈ పరీక్ష స్వామీ?.. మంచు విష్ణు ట్వీట్ వైరల్)
ఇప్పుడు అల్లరి నరేశ్ చేయబోయే సినిమా కోసం ఓ క్రేజీ టైటిల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పుడంతా మాస్ ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో 'ఆల్కహాల్' అని ఓ పేరుని రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది. రీసెంట్ టైంలో హిట్ సినిమాలతో ఆకట్టుకుంటున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్.. అల్లరోడితో ఈ మూవీని నిర్మించనుందని సమాచారం.
'సుడిగాడు' తర్వాత తర్వాత అల్లరి నరేశ్.. కెరీర్ పరంగా కాస్త టర్న్ తీసుకున్నాడు. 'ఉగ్రం' మూవీతో డిఫరెంట్ ప్రయత్నం చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. మళ్లీ అదే దర్శకుడితో కలిసి 'నాంది' చేశాడు. కాకపోతే బాక్సాఫీస్ దగ్గర ఓ మాదిరి రెస్పాన్స్ అందుకుంది. 'బచ్చలమల్లి'పై నరేశ్ కాస్త ఎక్కువ అంచనాలు పెట్టుకున్నాడు గానీ పూర్తిగా ఇది నిరాశపరిచింది. అయినా సరే తగ్గకుండా ఆ తరహా కథతోనే 'ఆల్కహాల్' చేయబోతున్నాడని తెలుస్తోంది. త్వరలో ఈ ప్రాజెక్టుపై క్లారిటీ రావొచ్చు.
(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)