
హెబ్బా పటేల్, దినేష్, పాయల్ రాధాకృష్ణ
దినేష్ తేజ్ హీరోగా, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్లుగా నటించిన ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ ఫిల్మ్ ‘అలా నిన్ను చేరి’. మారేష్ శివన్ దర్శకత్వంలో కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 10న విడుదల కానుంది.
‘‘కుటుంబ సమేతంగా చూడదగ్గ లవ్ అండ్ ఎమోషనల్ ఫిల్మ్ ఇది. చంద్రబోస్‌గారి సాహిత్యం, సుభాస్ ఆనంద్ సంగీతం అదనపు ఆకర్షణలు’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది.