Akshay Kumar: 'భరించలేనంత నొప్పిని అనుభవిస్తున్నా'

Akshay Kumars Mother Aruna Bhatia Dies In Mumbai - Sakshi

Akshay Kumars Mom Aruna Bhatia Dies: బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ తల్లి అరుణ భాటియా కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనోరోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం(సెప్టెంబర్‌8)న తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని అక్షయ్‌ స్వయంగా ట్విట్టర్‌ ద్వారా వెల్లడిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు.'ఆమె నా జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తి. నా తల్లి ఈ లోకంలో లేదని తెలిసి భరించలేంత నొప్పిని అనుభవిస్తున్నాను. మా అమ్మ అరుణ భాటియా ఈరోజు ఉదయం ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. వేరే లోకంలో ఉన్న మా నాన్నను ఆమె కలువనున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నా కుటుంబం కోసం మీరు చేస్తున్న ప్రార్థనలకు కృతజ్ఞతలు. ఓం శాంతి' అంటూ అక్షయ్‌ ట్వీట్‌ చేశారు. 

కాగా అక్షయ్‌కి తల్లి అంటే అమితమైన ప్రేమ. అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని దగ్గరుండి చూసుకునేవాడట. ఈ క్రమంలో సిండ్రెల్లా మూవీ షూటింగ్‌ కోసం యూకే వెళ్లిన ఆయన  తల్లి అస్వస్థతకు గురయ్యారని తెలియాగానే ఆగ మేఘాల మీద యూకే నుంచి ముంబైకి చేరుకున్న సంగతి తెలిసిందే.

కొన్నిరోజులుగా ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ముంబైలోని  హిరానందాని ఆసుపత్రిలో ఐసీయూలో చేరారు. అయితే పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం కన్నుమూశారు. అక్షయ్‌ తల్లి చనిపోయిందన్న వార్త తెలియడంతో ప్రముఖులు సహా నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 

చదవండి: నేహాకక్కడ్‌: అత్యధిక ఫాలోవర్స్‌ ఉన్న విమెన్‌ సింగర్‌..
31ఏళ్ల వ్యక్తితో పెళ్లి.. 'వాంప్‌ సింగర్‌' అన్నారు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top