Akshay Kumar Will Not Come To Shooting on Sunday - Sakshi
Sakshi News home page

Akshay Kumar: ఇది మీకు తెలుసా.. వారంలో ఆ ఒక్క రోజు అక్షయ్‌ షూటింగ్‌కి వెళ్లడట!

Aug 30 2022 7:54 PM | Updated on Aug 30 2022 8:12 PM

Akshay Kumar Will Not Come to shooting on Sunday - Sakshi

ఇప్పటి బాలీవుడ్‌లో క్రమశిక్షణ అని గూగుల్‌ చేసి చూడండి.. అక్షయ్‌ కుమార్‌ అని రాకపోతే అప్పుడు అడగండి అనే కామెంట్‌.. కాంప్లిమెంట్‌ను సమానంగా అందుకుంటున్నాడు ఆ హీరో. పంక్చువాలిటీని మైంటెయిన్‌ చేయడంలో అక్షయ్‌ కుమార్‌ తర్వాతే ఎవరైనా! మిన్ను విరిగి మీద పడ్డా.. టైమ్‌కి భోజనం ఆపడు. గొప్ప బిజినెస్‌ మ్యాగ్నైట్స్, పెద్ద హీరోల పార్టీలైనా సరే రాత్రి ఎనిమిదయిందంటే క్షణం కూడా అక్కడుండడు. తొమ్మిదికల్లా నిద్రపోయే తన నియమాన్ని సడలించడు. అలాగే ఆదివారాలు నో షూటింగ్‌ అనే షరతు పెడతాడట.

(చదవండి: హీరోయిన్‌ అమలాపాల్‌కు లైంగిక వేధింపులు!)

ఎంత పెద్ద బడ్జెట్‌ సినిమా అయినా సరే.. ఎంత స్టార్‌ కాస్ట్‌ను భరిస్తున్న చిత్రమైనా సరే.. తన షరతు విషయంలో నో కాంప్రమైజ్‌ అంటాడు అక్షయ్‌ కుమార్‌. అలా అని సినిమాలు తగ్గిస్తాడా అంటే అదీ లేదు. ఒక్క ఏడాదికే అరడజను పైగా సినిమాలు చేస్తాడు. ఈ ఏడాది ఇప్పటికే బచ్చన్ పాండే , సమ్రాట్ పృథ్వీరాజ్, రక్షాబంధన్ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఈ చిత్రాలన్ని డిజాస్టర్స్‌ లిస్ట్‌లోకి వెళ్లిపోయాయి. అయినప్పటికీ.. ఇంకో సినిమాను రిలీజ్ రెడీ చేస్తున్నాడు అక్షయ్‌. ఆయన హీరోగా నటించిన కఠ్‏పుత్లీ సెప్టెంబర్ 2న హాట్ స్టార్ లో డైరెక్ట్ గా రిలీజ్ అవుతోంది. తెలుగులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన రాక్షసుడు సినిమా రీమేక్ ఇది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement