చలో స్కాట్‌ల్యాండ్‌ | Akshay Kumar starts shooting Bell Bottom in Scotland | Sakshi
Sakshi News home page

చలో స్కాట్‌ల్యాండ్‌

Aug 7 2020 12:40 AM | Updated on Aug 7 2020 4:58 AM

Akshay Kumar starts shooting Bell Bottom in Scotland - Sakshi

అక్షయ్‌ కుమార్

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో స్వదేశంలో షూటింగ్‌ అంటేనే రిస్క్‌.. ఇక విదేశాల్లో షూటింగ్‌ ఎలా? అని సినిమా ఇండస్ట్రీ ఆలోచిస్తోంది. కానీ విదేశాల్లో షూటింగ్‌ కి సంబంధించిన ప్లానింగ్‌ మాత్రమే కాదు.. ప్రయాణం కూడా మొదలెట్టారు అక్షయ్‌ అండ్‌ టీమ్‌. అక్షయ్‌ కుమార్‌ హీరోగా తెరకెక్కనున్న పీరియాడిక్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘బెల్‌ బాటమ్‌’. రంజిత్‌ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వాణీకపూర్‌ కథానాయిక. లారా దత్, హ్యూమా ఖురేషీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. డిటెక్టివ్‌ పాత్రలో అక్షయ్‌ కనిపించనున్నారు.

ఈ సినిమా షూటింగ్‌ కోసం 120 మంది స్కాట్‌ ల్యాండ్‌ ప్రయాణమయ్యారు. లాక్‌ డౌన్‌  తర్వాత విదేశాల్లో షూట్‌ చేయనున్న చిత్రమిదే. ప్రభుత్వ గైడ్‌ లైన్స్‌ అనుసరిస్తూ చిత్రీకరణ ప్లాన్‌ చేశారు. చిత్ర యూనిట్‌ అందరికీ స్పెషల్‌ రిస్ట్‌ బ్యాండ్‌లు అందించారట. దీంతో ఎప్పటికప్పుడు ఆ వ్యక్తి బ్లడ్‌ ప్రెషర్, ఉష్ణోగ్రత, ఆక్సిజన్‌ లెవెల్‌.. అన్నీ తెలుసుకోవచ్చు. స్కాట్‌ ల్యాండ్‌ వెళ్లిన తర్వాత కొన్ని రోజులు క్వారంటైన్‌ లో ఉన్న తర్వాతే చిత్రీకరణకు సంబంధించిన పనులు మొదలు పెడతారట. ‘‘మళ్ళీ షూటింగ్‌ తో బిజీ అయ్యే టైమ్‌ రావడం చాలా బావుంది’’ అన్నారు అక్షయ్‌ కుమార్‌.

Advertisement
 
Advertisement
Advertisement