రొమాంటిక్‌గా బెలూన్‌ పగలగొట్టిన అక్షయ్‌, జాక్వెలిన్‌.. వీడియో వైరల్‌ | Akshay Kumar and Jacqueline Romantic Dance Video Viral | Sakshi
Sakshi News home page

Akshay Kumar: రొమాంటిక్‌గా బెలూన్‌ పగలగొట్టిన అక్షయ్‌, జాక్వెలిన్‌.. వీడియో వైరల్‌

Oct 30 2021 12:14 PM | Updated on Oct 30 2021 2:29 PM

Akshay Kumar and Jacqueline Romantic Dance Video Viral - Sakshi

బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు విడుదల చేస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ ఉంటాడు. ఆయన తాజాగా రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో చేస్తున్న తాజా చిత్రం ‘సూర్యవంశీ’..

బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు విడుదల చేస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ ఉంటాడు. ఆయన తాజాగా రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో చేస్తున్న తాజా చిత్రం ‘సూర్యవంశీ’ విడుదలకు సిద్ధంగా ఉంది. కాగా మరో సినిమా ‘రామసేతు’ నిర్మాణ దశలో ఉంది.

ఈ మూవీలో అక్షయ్‌కి జోడిగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించి ఓ వీడియోని ఈ స్టార్‌ సోషల్‌మీడియాలో షేర్‌ చేశాడు. అందులో మోకాళ్లపై నిలుచున్న ఈ హీరో హార్ట్‌ షేప్‌లో ఉన్న బెలూన్‌ని హీరోయిన్‌కి అందిస్తాడు. రొమాంటిక్‌ ముందుకు వచ్చి ఆమె చేతులు పట్టుకుంటాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్యలో బెలూన్‌ ఉండిపోగా.. వారి ఒత్తిడి కారణంగా అది పగిలిపోతుంది. దీంతో ఈ ఇద్దరూ నవ్వుతూ ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఈ వీడియోకి నేను, జాక్వెలిన్‌ ఎంత రొమాంటిక్‌గా బబుల్‌ని పగలగొట్టామో చూడండి అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు. దీంతో ఈ వీడియో ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది.

చదవండి: ‘బైక్‌ కవర్‌ వేసుకున్నావా’.. కాజోల్‌ని ట్రోల్‌ చేసిన నెటిజన్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement