Akram Movie Teaser Out Deets Here | Akram Suresh - Sakshi
Sakshi News home page

Akram Movie Teaser: రానా, అక్రమ్‌లు ఎవరు?

Jun 4 2022 10:47 AM | Updated on Jun 4 2022 11:54 AM

Akram Movie Teaser Out - Sakshi

‘అక్రమ్‌’ సురేశ్‌ హీరోగా రామ్స్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అక్రమ్‌’. రాజధాని మూవీస్‌ పతాకంపై ఎంవీఆర్‌ అండ్‌ విసకోటి మార్కండేయులు నిర్మించిన ఈ సినిమా టీజర్‌ రిలీజైంది. ఈ సందర్భంగా అక్రమ్‌ సురేష్‌ మాట్లాడుతూ – ‘‘చిన్న సినిమాల్లో కూడా మంచి కంటెంట్‌ ఉంటుంది. ఈ చిత్రకథ, డైలాగ్స్‌ నేనే రాశాను. కథలో రానా, అక్రమ్‌లు ఎవరు? అనేది సినిమాలో తెలుస్తుంది.

ఈ కథలో అన్ని కోణాలు ఉన్నాయి. ఇది యాక్షన్, సోషియో ఫ్యాంటసీ మూవీ. నేను అక్కినేని నాగేశ్వరరావుగారి అభిమానిని. త్వరలో ట్రైలర్, ప్రీ రిలీజ్‌ ఫంక్షన్స్‌ నిర్వహిస్తాం. ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కు అతిథిగా నాగార్జునగారు వచ్చే అవకాశం ఉంది’’ అన్నారు. సంగీత దర్శకుడు సాయిదీప్, కెమెరామేన్‌ అనిల్‌కుమార్‌ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement