ChaySam Divorce: Akkineni Nagarjuna Respond On Naga Chaitanya, Samantha Divorce - Sakshi
Sakshi News home page

ChaySam Divorce: చైతు-సమంత విడాకులపై నాగార్జున స్పందన

Oct 2 2021 6:09 PM | Updated on Oct 2 2021 8:59 PM

Akkineni Nagarjuna Respond On Naga Chaitanya, Samantha Divorce - Sakshi

నాగచైతన్య-సమంతల విడాకులపై అక్కినేని నాగార్జున స్పందించారు. చైతూ-సమంత విడిపోవడం దురదృష్టకరమన్నారు. భార్యభర్తలు విడిపోవడం వారి వ్యక్తిగత విషయమని ట్వీట్‌ చేశారు. సమంత ఫ్యామిలీ ఎల్లప్పుడూ తమకు ఆత్మీయులేనని, చైతు-సమంత ఎప్పటికీ తన గుండెల్లో ఉంటారని నాగార్జున చెప్పుకొచ్చారు.

‘ఎంతో బరువైన హృదయంతో ఈ విషయాన్ని చెప్పాల్సి వస్తోంది. చైతు-సమంత విడిపోవటం దురదృష్టకరం. భార్యాభర్తల మధ్య ఏం జరిగినా అది వాళ్ల వ్యక్తిగతం. సమంత, నాగచైతన్య ఇద్దరూ నాకెంతో దగ్గరి వారు. సమంతతో నా కుటుంబం గడిపిన ప్రతి క్షణం ఎంతో మధురమైంది. ఆమె కుటుంబ సభ్యులు ఎల్లప్పుడు మాకు ఆత్మీయులే. దేవుడు వాళ్లిద్దరికీ మనో ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా. వారికి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి’అని నాగ్‌ ట్వీట్‌ చేశాడు. 

కాగా, చైతన్య-సమంత తాము విడిపోతున్నామని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. సమంతతో విడాకులు తీసుకోనున్నట్లు శనివారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు చైతన్య. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

చై-సామ్‌ పెళ్లినాటి  ఫోటోలు

Advertisement
 
Advertisement
Advertisement