Akhil Agent Movie Heroine Sakshi Vaidya Opens Up On Her Telugu Debut - Sakshi
Sakshi News home page

Sakshi Vaidya: ఫోన్ చేసి చెప్పారు.. అయినా నమ్మలేదు: సాక్షి వైద్య

Apr 28 2023 7:23 AM | Updated on Apr 28 2023 9:20 AM

Akhil Agent Movie Heroine Sakshi Vaidya

అఖిల్‌ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఏజెంట్‌’. ఈ చిత్రంలో హీరోయిన్‌గా సాక్షి వైద్య నటిస్తోంది. అనిల్‌ సుంకర ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఈనెల 28న విడుదలైంది. ఈ సందర్భంగా హీరోయిన్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇది తెలుగులో నా తొలి సినిమా అని.. మంచి సినిమాతో పరిచయం కావడం  ఆనందంగా ఉందన్నారు సాక్షి వైద్య.

సాక్షి వైద్య మాట్లాడుతూ .. 'వృత్తి రీత్యా నేను ఫిజియోథెరపిస్ట్‌ని. కొవిడ్‌ సమయంలో ఖాళీగా ఉండటం ఇష్టం లేక సోషల్‌ మీడియాలో కొన్ని రీల్స్‌ చేశాను. అవి వైరల్‌ అయ్యాయి. ఆ తర్వాత నా స్నేహితుల సలహా మేరకు కొన్ని ఆడిషన్స్‌ ఇచ్చాను. కొన్ని అవకాశాలు వచ్చినా నచ్చలేదు. కాగా ‘ఏజెంట్‌’ ప్రొడక్షన్‌ టీమ్‌ నుంచి ఒకరు ఫోన్‌ చేసి హీరోయిన్‌ ఛాన్స్‌ గురించి చెప్పారు.

ఈ ఆఫర్‌ను నేను మొదట్లో  స్కామ్‌ అనుకున్నాను. కానీ ముంబైలో ఉన్న ఓ కాస్టింగ్‌ డైరెక్టర్‌ ఏకే ఎంటర్‌ టైన్మెంట్స్‌ పెద్ద బేనర్‌  అని, పెద్ద దర్శకుడు, పెద్ద  స్టార్‌ అని చెప్పగానే హైదరాబాద్‌ వచ్చి ఆడిషన్స్‌ ఇచ్చాను. ‘ఏజెంట్‌’ కంప్లీట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌. ఈ చిత్రంలో పైలెట్‌ పాత్రలో కనిపిస్తాను. ‘ఏజెంట్‌’ నాకు మంచి అనుభూతిని ఇచ్చింది. ప్రస్తుతం వరుణ్‌ తేజ్‌తో ‘గాంఢీవదారి అర్జున’ చేస్తున్నాను' అని అన్నారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement