ఆకాశ్‌ పూరి ‘రొమాంటిక్‌’ మూవీ విడుదల ఎప్పుడంటే..

Akash Puri Romantic Movie Release Date Announcement - Sakshi

డైనమిక్‌ డైరెక్టర్‌ పూరిగజన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రొమాంటిక్‌’.ఈ సినిమాకు పూరి శిష్యుడు అనిల్ పాదూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కేతికా శర్మ అలాగే కథ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ పూరిజగన్నాథ్ అందించారు. పూర్తి స్థాయి ప్రేమకథా చిత్రంగా సిద్ధమవుతోన్న ఈ మూవీ షూటింగ్‌ కరోనా కారణంగా  వాయిదా పడుతూ వస్తుంది.
(చదవండి: డిన్నర్‌ పార్టీలో ఎమోషనల్‌ అయిన నాగార్జున)

ఇప్పటికే రిలీజ్ అయినా ఈ సినిమా పోస్టర్లు, రెండు పాటలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు చిత్రయూనిట్. దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందులో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తోంది.  సునీల్‌ కశ్యప్‌ సంగీతం అందిస్తున్నాడు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top