డిన్నర్‌ పార్టీలో ఎమోషనల్‌ అయిన నాగార్జున | Love Story: Nagarjuna Got Emotional During Dinner With Aamir Khan | Sakshi
Sakshi News home page

Nagarjuna: ఆ విషయం తలుచుకొని నాగార్జున భావోద్వేగం

Sep 25 2021 4:01 PM | Updated on Sep 25 2021 6:38 PM

Love Story: Nagarjuna Got Emotional During Dinner With Aamir Khan - Sakshi

Nagarjuna Got Emotional During Dinner With Aamir Khan: అక్కినేని ఫ్యామిలీలో జరిగిన డిన్నర్‌ పార్టీలో నాగార్జున ఎమోషనల్‌ అయ్యారు..

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘లవ్‌స్టోరి’ చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకెళ్తుంది. ఫిల్మ్‌ దునియాలో వినిపిస్తున్న సమాచారం మేరకు తొలిరోజే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 10 కోట్లను వసూళ్లు చేసినట్లు సమచారం. దీంతో లవ్‌స్టోరీ టీం సక్సెస్‌ సెలబ్రేషన్స్‌లో ఫుల్‌ బిజీగా ఉంది. మరోవైపు ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన అమీర్‌ ఖాన్‌కు అక్కినేని కుటుంబం గ్రాండ్‌గా డిన్నర్‌ పార్టీ ఇచ్చింది.

చదవండి: Ali Home Tour: కమెడియన్‌ అలీ 'హోమ్‌ టూర్‌' చూశారా?

నాగ చైతన్య, సాయి పల్లవి, శేఖర్‌ కమ్ములతో పాటు మరికొందరు ఈ పార్టీలో పాల్గొన్నారు. అందరూ కలిసి కేక్‌ కట్‌ చేసి సక్సెస్‌ను సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఈ సందర్భంగా అమీర్‌ఖాన్‌తో నాగార్జున ప్రత్యేకంగా ముచ్చటించారు. 

ఇక లవ్‌స్టోరీ సినిమా విడుదలైన సెప్టెంబర్‌ 24నే  50 సంవత్సరాల క్రితం ఏఎన్నార్‌ నటించిన ‘ప్రేమ్‌నగర్‌’ ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. లవ్‌స్టోరీ మూవీ సైతం సక్సెస్‌ సాధించడంతో నాగార్జున ఒకింత ఎమోషనల్‌ అయినట్లు తెలుస్తుంది.

అంతేకాకుం‍డా ‘లాల్‌ సింగ్‌ చద్దా’ సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్న నాగచైతన్య ఆ సినిమాలో బాలరాజు అనే తెలుగు ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఈ సందర్భంగా గతంలో ఏఎన్నార్‌ కూడా బాలరాజు పేరుతో తీసిన సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సందర్భాన్ని గుర్తు చేసుకొని నాగార్జున భావేద్వేగానికి లోనయ్యారు. 

చదవండి : Love Story Box Office: రికార్డు స్థాయిలో ‘లవ్‌స్టోరి’ కలెక్షన్స్‌
Love Story Review: ‘లవ్‌స్టోరి’ మూవీ రివ్యూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement