Akash Puri 'Chor Bazaar Trailer' Out Now - Sakshi
Sakshi News home page

Chor Bazaar Trailer: బచ్చన్‌ సాబ్‌ అంటూ వస్తున్న ఆకాశ్‌ పూరి

Jun 9 2022 6:10 PM | Updated on Jun 9 2022 6:34 PM

Akash Puri Chor Bazaar Trailer Out Now - Sakshi

నా పేరు బచ్చన్‌.. బచ్చన్‌ సాబ్‌.. దునియాల ప్రతివోనికీ ఏదో ఒక దూల ఉంటది. నాకు నా చేయి దూల అన్న డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలైంది. హీరోయిన్‌ మూగ అమ్మాయిగా నటించినట్లు తెలుస్తోంది.

ఆకాశ్‌ పూరి, గెహనా సిప్పీ జంటగా నటించిన లవ్, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘చోర్‌ బజార్‌’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వంలో వీఎస్‌ రాజు నిర్మించాడు. గురువారం ఈ సినిమా నుంచి ట్రైలర్‌ రిలీజైంది. 'నా పేరు బచ్చన్‌.. బచ్చన్‌ సాబ్‌.. దునియాల ప్రతివోనికీ ఏదో ఒక దూల ఉంటది. నాకు నా చేయి దూల' అంటూ ఆకాష్‌ డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలైంది. హీరోయిన్‌ మూగ అమ్మాయిగా నటించినట్లు తెలుస్తోంది.

ఇక డైమండ్‌ ఎలాగైనా మ్యూజియంలో ఉండాలన్న సునీల్‌ మాటలను బట్టి దాన్ని దొంగిలించారని తెలుస్తోంది. అసలీ డైమండ్‌ గోల తెలియాలన్నా, హీరో ప్రేమ గెలిచిందా? లేదా? అన్నది చూడాలన్నా సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే. ఈ చిత్రానికి కెమెరా: జగదీష్‌ చీకటి, సంగీతం: సురేష్‌ బొబ్బిలి, సహనిర్మాత: అల్లూరి సురేష్‌ వర్మ.

చదవండి: ఇద్దరం ఒక్కటయ్యాం.. పెళ్లి ఫొటో షేర్‌ చేసిన విఘ్నేశ్‌
నాన్న సినిమా చేద్దామంటే కుదరదని చెప్పేశా: ఆకాశ్‌ పూరి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement