Aishwarya Rajinikanth Says Love Should Not Be Constrained to Some Singular Being - Sakshi
Sakshi News home page

Aishwaryaa Rajinikanth: ప్రేమ ఒక్కరితో ఆగిపోదు.. విడాకుల తర్వాత ఐశ్వర్య ఆసక్తికర వ్యాఖ్యలు

Feb 17 2022 9:33 PM | Updated on Feb 18 2022 10:55 AM

Aishwarya Rajinikanth: Love Should Not Be Constrained To Some Singular Being - Sakshi

కోలీవుడ్‌ స్టార్‌ జంట ధనుష్‌- ఐశ్వర్య రజనీకాంత్‌ విడిపోయిన విషయం తెలిసిందే! 18 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ ఇద్దరూ విడిపోతున్నట్లు జనవరిలో సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే అవి కుటుంబ తగాదాలేనని, వారు మళ్లీ కలుస్తారని ధనుష్‌ తండ్రి వ్యాఖ్యానించడంతో వీరిద్దరూ మళ్లీ ఒక్కటైపోతారేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.

ఇదిలా ఉంటే ఇటీవల కరోనా బారిన పడిన ఐశ్వర్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రేమ గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించింది. 'ప్రేమ అనేది అద్భుతమైన భావవ్యక్తీకరణ. ఇది ఒక వ్యక్తికో, వస్తువుకో సంబంధించింది కాదు. నేను ఎదిగేకొద్దీ ప్రేమ నిర్వచనం కూడా మారుతూ వస్తోంది. నాకు మా అమ్మానాన్న అంటే ఇష్టం. అలాగే నా పిల్లలను ప్రేమిస్తున్నాను. ప్రేమ ఒక వ్యక్తితో ఆగిపోదు' అని చెప్పుకొచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement