పొన్నియిన్ సెల్వన్: తొలి భాగం షూటింగ్‌ పూర్తి, విడుదల ఎప్పుడంటే.. | Aishwarya Rai Shares Update About Ponniyin Selvan | Sakshi
Sakshi News home page

Ponniyin Selvan: ‘పొన్నియిన్ సెల్వన్‌’ పోస్టర్‌ రిలీజ్‌ చేసిన ఐశ్వర్యరాయ్‌

Sep 19 2021 12:09 PM | Updated on Sep 19 2021 12:50 PM

Aishwarya Rai Shares Update About Ponniyin Selvan - Sakshi

స్టార్‌ డెరెక్టర్‌ మణిరత్నం దర్శకతంలో ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌ ‘పొన్నియిన్ సెల్వన్’ చే​స్తున్న విషయం తెలిసిందే. అందులో ఆమె యువరాణి నందిని పాత్ర పోషిస్తోంది. పిరియాడిక్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్టర్‌ను ఆదివారం (సెప్టెంబర్‌ 19న) ఆమె సోషల్‌ మీడియాలో విడుదల చేసింది.

రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా మొదటి పార్ట్‌ ‘పీఎస్‌1’ పూర్తయినట్లు, సమ్మర్‌ కానుకగా 2022లో విడుదల కానున్నట్లు పోస్టర్‌లో మూవీ టీం వెల్లడించింది. విక్రమ్, కార్తీ, త్రిష, ‘జయం’ రవి ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. కల్కి కృష్ణమూర్తి నవల ‘పొన్నియిన్ సెల్వన్’ ఆధారంగా సుభాస్కరన్‌ సమర్పణలో లైకా  ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కాగా, గతనెల పీఎస్‌1 సెట్స్‌ నుంచి ఐశ్వర్య ఫోటో ఒకటి బయటికి వచ్చి వైరల్‌ అయింది. అందులో ఆమె బంగారు రంగు చీర, భారీ ఆభరణాలతో ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement