Aishwarya Lekshmi: పెళ్లంటే ఇష్టం లేదంటూనే ప్రేమలో పడ్డ హీరోయిన్‌

Aishwarya Lekshmi Loves Arjun Das, Shares Post - Sakshi

అమ్ము, పొన్నియన్‌ సెల్వన్‌, మట్టి కుస్తీ సినిమాలతో ఫేమ్‌ సంపాదించుకున్న మలయాళ కుట్టి ఐశ్వర్య లక్ష్మి. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో నటుడు అర్జున్‌ దాస్‌తో ప్రేమలో ఉన్నట్లు వెల్లడించింది. అర్జున్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్‌ చేసిన ఆమె దానికి లవ్‌ సింబల్‌ను జోడించింది. ఇది చూసిన ఫ్యాన్స్‌ కొందరు కంగ్రాట్స్‌ చెప్తుంటే మరికొందరు మాత్రం ఇది ప్రమోషన్‌ స్టంట్‌ అయ్యుండొచ్చు, త్వరలో ఏదైనా కొత్త ప్రాజెక్ట్‌లో కలిసి నటిస్తున్నారేమో అని కామెంట్లు చేస్తున్నారు.

కాగా అర్జున్‌ దాస్‌ మాస్టర్‌ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటించాడు. బుట్టబొమ్మ చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఐశ్వర్య లక్ష్మి ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో ప్రేమ పెళ్లి ఇష్టమా? పెద్దలు కుదిర్చిన వివాహం ఇష్టమా? అన్న ప్రశ్నకు అసలు పెళ్లంటేనే ఇష్టం లేదని చెప్పింది. అలా చెప్పిన నెల రోజులకే ప్రియుడిని పరిచయం చేస్తూ పోస్ట్‌ పెట్టడంతో ఫ్యాన్స్‌ ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top