Aha OTT Releases: ఆహాలో ఒకేరోజు ఏకంగా 15 సినిమాలు విడుదల

తెలుగు ప్రేక్షకులకు గుడ్‌న్యూస్. తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం అయిన ఆహా ఒకేరోజు ఏకంగా 15 సినిమాలను విడుదల చేస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆహా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ‘రేపు (జూలై 2) ఒకే రోజు 15 సినిమాలను విడుదల చేయబోతున్నాం’ అంటూ ఆహా ఈ రోజు ట్వీట్ చేసింది. అంతేగాక ఆ సినిమాల జాబితాను కూడా ప్రకటించింది. కాగా ఆహా ఒరిజినల్స్ పేరుతో వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్‌ల విడుదలకు నిర్వహకులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆహా ఒకే రోజు 15 సినిమాలు విడుదల చేయబోతుంది. ఇందులో కొత్త సినిమాలతో పాటు కొన్ని పాత సినిమాలు కూడా ఉన్నాయి.
అయితే గతేడాది లాక్‌డౌన్ ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు ఆహా ఓటీటీ ప్రపంచంలోకి అడుగు పెట్టగా, ఇటీవల వరుసగా వెబ్‌సిరీస్‌లు, సినిమాలు రిలీజ్ చేస్తూ ఓటీటీలో టాప్ స్థానానికి చేరుకుంది. ఈ క్రమంలో ఆహా ఇప్పుడు అమెజాన్, నెట్‌ఫ్లిక్స్‌లకు పోటీగా ఆహా ఇప్పుడు వెబ్ సిరీస్‌లను కూడా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. మారుతి, క్రిష్, వంశీ, పైడిపల్లి, నందిని రెడ్డి వంటి డైరెక్టర్లు సైతం ఆహా దాదాపు 25 కోట్ల రూపాయలకు వెబ్ సిరీస్‌లను ప్లాన్ చేస్తున్నారు.
Ee sukruvaaram, meeku padihenu cinemalu isthunnam. Life lo entertainment undaali kada andi😉
Subscribe to aha▶️ https://t.co/yiFT8xGrvl pic.twitter.com/CEUG4Cci8O
— ahavideoIN (@ahavideoIN) July 1, 2021