Aha Announced '18 Pages' Movie OTT Release Date - Sakshi
Sakshi News home page

18 Pages Movie: నిఖిల్‌ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన ఆహా

Jan 20 2023 4:25 PM | Updated on Jan 20 2023 5:19 PM

AHA Announced 18 Pages Movie Streaming Date - Sakshi

ఫీల్‌ గుడ్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ హక్కులను అటు ఆహా, ఇటు నెట్‌ఫ్లిక్స్‌ రెండూ చేజిక్కించుకున్న విషయం తెలిసిందే! అయితే ముందుగా 18 పేజెస్‌ ఆహాలో రిలీజ్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది. జ

కార్తికేయ 2 తర్వాత నిఖిల్‌ సిద్దార్థ్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన చిత్రం 18 పేజెస్‌.గతేడాది డిసెంబర్‌ 23న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్‌తో పాటు మంచి వసూళ్లే వచ్చాయి. ఫీల్‌ గుడ్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ హక్కులను అటు ఆహా, ఇటు నెట్‌ఫ్లిక్స్‌ రెండూ చేజిక్కించుకున్న విషయం తెలిసిందే! అయితే ముందుగా 18 పేజెస్‌ ఆహాలో రిలీజ్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది. జనవరి 27 నుంచి ఆహాలో స్ట్రీమింగ్‌ కానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది.

మరింకెందుకాలస్యం.. థియేటర్‌లో సినిమా చూడటం మిస్‌ అయినవాళ్లు వచ్చే శుక్రవారం ఫ్యామిలీతో కలిసి 18 పేజెస్‌ వీక్షించేయండి. ఇక సినిమా విషయానికి వస్తే.. సుకుమార్‌ కథ అందించగా ఆయన శిష్యుడు, కుమారి 21 ఎఫ్‌ ఫేమ్‌ సూర్యప్రతాప్‌ డైరెక్టర్‌గా వ్యవహరించాడు. మెగా నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మించాడు.

చదవండి:గర్భవతిగా పూజా.. స్విమ్మింగ్‌ పూల్‌లో ముద్దులాట
అంబానీ ఇంట్లో ఫంక్షన్‌కు ఆ డ్రెస్‌లో వెళ్తావా?

Advertisement
 
Advertisement
Advertisement